ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
ఆకలి అవ్వడం అనేది కామన్. ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి అంటుంటారు. అయితే కొంత మంది తెలిసి, మరికొంత మంది నిర్లక్ష్యంతో ఆకలిగా ఉన్నా, ఏదీ తినకుండా ఉంటారు. అయితే ఆకలిగా ఉన్నప్పుడు ఏం తినకపోతే
దిశ, వెబ్‌డెస్క్ : ఆకలి అవ్వడం అనేది కామన్. ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి అంటుంటారు. అయితే కొంత మంది తెలిసి, మరికొంత మంది నిర్లక్ష్యంతో ఆకలిగా ఉన్నా, ఏదీ తినకుండా ఉంటారు. అయితే ఆకలిగా ఉన్నప్పుడు ఏం తినకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంట. ఆ సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆకలిగా ఉన్నప్పుడు లేదా వేళకు భోజనం చేయకపోతే శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ పెరుగుతుంది. దీంతో తరువాత ఎప్పుడు భోజనం చేసినా మనకు తెలియకుండానే ఎక్కువగా ఆహారం తింటాం. ఇలా రోజూ చేస్తే అధికంగా బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.అలాగే, ఆరోగ్యవంతుల్లో అయితే షుగర్ లెవల్స్ పడిపోతాయంట. దీంతో ఏకాగ్రతను కోల్పోతారు. నేరుగా ఆలోచించలేరు. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేయదు.
Read more:
ఏ రకమైన ఆహారాలు గట్ హెల్త్‌ను దెబ్బతీస్తాయో తెలుసా?