గుండె నొప్పి, గ్యాస్ నొప్పి ఈ రెండింటిని ఎలా గుర్తించాలో తెలుసా?
ప్రస్తుతం చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గుండెలో కాస్త నొప్పిగా అనిపించినా విపరీతమైన టెన్షన్‌కు గురి అవుతున్నారు
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్ మరణాలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గుండెలో కాస్త నొప్పిగా అనిపించినా విపరీతమైన టెన్షన్‌కు గురి అవుతున్నారు. అయితే అది గుండె నొప్పినా, లేక గ్యాస్ వలన వచ్చిన నొప్పినా అని తెలుసుకోలేకపోతున్నారు. మరి కొందరు గుండె నొప్పి వచ్చినా, అది గ్యాస్ నొప్పి అనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదకు తీసుకొచ్చుకుంటున్నారు.
కాగా, గుండె నొప్పి వచ్చినప్పుడు ఉండే లక్షణాలు, గ్యాస్ వలన గుండె నొప్పి వచ్చినప్పుడు ఉండే లక్షణాలు ఏవో తెలుసుకోవడం ద్వారా మనకు వచ్చింది గుండె నొప్పినా లేక గ్యాస్ పామ్ అవ్వడం వలన వచ్చిందో ఈజీగా తెలుసుకోవచ్చంట.
గుండె నొప్పి వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు..
విపరీతమైన చెమట పట్టడం, గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. ఛాతి మీద ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది.
ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ ఉంటాయి.
విరేచనాలు, వాంతులు అవుతాయి.
ఎడమ వైపు దవడ నొప్పిగా ఉంటుంది. పట్టేసినట్లు అనిపిస్తుంది.
ఛాతి మధ్య భాగం నుంచి నిలువుగా గడ్డం వరకు నొప్పి ఉంటుంది.
గ్యాస్ నొప్పి వస్తే కనిపించే లక్షణాలు.
ఛాతిలో ఎడమ వైపు నొప్పిగా ఉంటుంది.
కడుపు ఉబ్బరంగా ఉంటుంది.
సాధారణ లేదా పుల్లని త్రేన్పులు వస్తాయి.
కడుపులో మంటగా ఉంటుంది. గుండెల్లో మంట వస్తుంది.
Also Read...