శృంగార సామర్ధ్యాన్ని పెంచే ఎండుద్రాక్ష.. ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..
ఈ మధ్యకాలంలో చాలా మంది తమ ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో చాలా మంది తమ ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా చేయడంతో పాటు మంచి డైట్ ను ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ ని డైట్ లో తీసుకుంటున్నారు. మనం తినే డ్రై ఫ్రూట్స్ లో కిస్మిస్ (ఎండు ద్రాక్ష) కు కాస్త ప్రత్యేకత ఉంది. ఇవి రుచికి తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ల కంటే కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషక పదార్థాలు ఈ కిస్మిస్ లో దాగి ఉన్నాయి. మరి ఈ కిస్మిస్ లో ఉండే ఔషధగుణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిస్మిస్ లో విటమిన్-B, రాగి అధికంగా ఉంటాయి. ఇది కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. వీటిని తినడం వల్ల ఎర్ర రక్తకణాలు అధికంగా ఉత్పత్తికి అయి రక్తం సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ లాంటివి రాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని చలికాలంలో ఎక్కువగా తింటే శరీరంలో బ్యాక్టీరియా చేరకుండా కాపాడి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
చాలా మంది ఎండిన ద్రాక్షను అలాగే తింటారు. అలాకాకుండా ఎండిన ద్రాక్షను నానబెట్టి తినడం వలన అధికంగా పోషకాలు లభిస్తాయి. అలాగే ద్రాక్షను నానబెట్టిన నీటిని తాగితే ద్రాక్షలో ఉండే పోషక విలువలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కిస్మిస్లో ఉండే కాల్షియం దంతాలకు, ఎముకలకు మంచిది. అలాగే ఇందులో ఉండే పాలిఫినాలిక్ ఫైటో శరీరం వాపును తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే పిల్లల మెదడు చురుకుగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు దీన్ని తింటే త్వరగా బరువును తగ్గవచ్చు. వీటిని ఎక్కువగా తీసుకుంటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. నీరసంగా ఉండేవారు దీన్ని తింటే ఒంట్లో నీరసం తగ్గుతుంది.
చూశారుగా కిస్మిస్ తినడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రతిరోజు కిస్మిస్ ను తినడం ప్రారంభించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.
Read More..
Drumstick Benefits : మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
లైంగిక సంబంధం లేకుండా గర్భం దాల్చిన అమ్మాయి.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?