ఈ సమస్యలున్న వారు ఆరెంజ్ తింటే ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్న పిల్లల కానుంది పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. ఈ పండ్లు ఎక్కువగా చలికాలం అందుబాటులో ఉంటాయి.
దిశ, ఫీచర్స్: చిన్న పిల్లల కానుంది పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. ఈ పండ్లు ఎక్కువగా చలికాలం అందుబాటులో ఉంటాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. ఉండటం వల్ల ఇవి మంచివని చాలా మంది తింటుంటారు. అలాగే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ సమస్యలు ఉన్నవారు తినడం వల్ల ప్రమాదం పొంచి ఉందట.
* దగ్గు, జలుబుతో బాధపడేవారు ఆరెంజ్ తింటే ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తుంది. దీంతో ఇబ్బంది మరింత పెరిగి పలు సమస్యలు వస్తాయట.
* కొన్ని ఆరెంజ్ పండ్లలో పుల్లగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల అసిడిటీ, కడుపునొప్పి వంటివి ఎదురవుతాయి.
*ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు కూడా ఆరెంజ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. లేదంటే సమస్య మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* ఆరెంజ్ రక్తం పల్చపరిచే గుణం ఉన్నందున దీనిని తీసుకోవడం మంచిది కాదు. అలాగే ఈ పండ్లు తినడం వల్ల గుండెల్లో మంట వస్తుందట.