పెరుగు అన్నం తిన్న తర్వాత, ఇవి తింటున్నారా.. అయితే జాగ్రత్త
దిశ, వెబ్‌డెస్క్ : పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం చేశాక చివరిలో తప్పనిసరిగా పెరుగుతో తినంది కొంత మందికి అన్నం తినట్టే ఉండదు అంటుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం చేశాక చివరిలో తప్పనిసరిగా పెరుగుతో తినంది కొంత మందికి అన్నం తినట్టే ఉండదు అంటుంటారు. ఇక పెరుగన్నం తినడం వలన శరీరంలో వేడి తగ్గించి శరీరం చల్లబడడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం, ఎముకలు ధృడంగా ఉండేలా చేస్తుంది. అయితే ఈ పెరుగును ఒకొక్కరు ఒక్కో విధంగా తీసుకుంటారు. కొందరు లస్సీలా, మరికొందరు మజ్జిగా, పెరుగు అన్నంలా తింటుంటారు. అయితే ఈ పెరుగు తిన్నాక వెంటనే కొన్ని ఆహార పదార్థాలు తినకూడదంటున్నారు ఆరోగ్యనిఫుణులు. ఇలా తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
- పెరుగు అన్నం తిన్న తర్వాత మినపప్పుతో చేసిన పిండి వంటలు తినకూడదు. దీనివలన ఆకలి మందగిస్తుందంట.
- కొంతమందికి పెరుగులో ఆనియన్స్ వేసుకొని తినడం కూడా మంచిది కాదంటున్నారు వైద్యులు. ఉల్లిపాయ ఏమో బాడీలో వేడిని పెంచుతుంది,పెరుగేమో మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇవి రెండు కలిపి తింటే గ్యాస్ ట్రబుల్, వాంతులు, ఎలర్జీలు వచ్చేఅవకాశం ఉంటుంది.
- పెరుగు అన్నం తిన్నతర్వాత ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదంట. దీని వలన అజీర్తీ, అల్సర్ లాంటివి వచ్చే ప్రమాదం ఉందంట.