దుప్పటి నిండుగా కప్పుకుని పడుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

పడుకునే సమయంలో చాలా మందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి.

Update: 2024-01-01 15:03 GMT

దిశ, ఫీచర్స్ : పడుకునే సమయంలో చాలా మందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి. కొంత మందికి తలకింద దిండు లేకపోతే నిద్ర పట్టదు, మరికొందరికి దిండు లేకుండా నిద్రించే అలవాటు ఉంటుంది. మరికొందరికి కాళ్ల కింద దిండు పెట్టుకోవడం, బోర్లా పడుకోవడం వంటి అలవాట్లు ఉంటాయి.

ముఖ్యంగా దుప్పటి నిండుగా కప్పుకుని పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. చలికాలంలో ప్రతి ఒక్కరు ముఖం పై పూర్తిగా దుప్పటిని కప్పుకుని పడుకుంటారు. ఇలా పడుకోవడం వలన ఎన్నో మేజర్ సమస్యలు ఎదురవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మెదడు దెబ్బతినే ప్రమాదం

కొంతమంది వైద్యనిపుణుల పరిశోధనల ప్రకారం పూర్తిగా మొహాన్ని కప్పుకుని నిద్రిస్తే మెదడు దెబ్బతింటుందట. బాడీలో ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందట. అందుకే పూర్తిగా ముసుగు వేసుకోకుండా పడుకోవాలని చెబుతున్నారు.

గుండెపోటు వచ్చే ప్రమాదం

పూర్తిగా ముసుగేసుకుని పడుకోవడం వలన ఆక్సిజన్ సరిగా అందక ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. ఉబ్బసం, గుండె సమస్యలతో బాధపడేవారికి ఆక్సిజన్ అందక గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.

స్లీప్  అమ్నీషియా

ముఖం పై కప్పుకుని నిద్రపోవడం వల్ల స్లీప్ అమ్నీషియా బారిన పడే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా నోరు మూసుకోవడం ద్వారా నోరు, ముక్కు ద్వారా గాలి ప్రవహించడం తగ్గుతుంది. దీంతో స్లీప్ అమ్నిషియా వచ్చే ప్రమాదం ఉందట.

అలసినట్లు అనిపించడం

శరీరానికి గాలి తగలకుండా కప్పుకుని పడుకుంటే శరీరానికి గాలి తగలకుండా ఒళ్ళు వేడెక్కుతుంది. జర్వం వచ్చిన భావన, కండరాల తిమ్మిరి, ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News