Health tips:పగిలిన పాదాలకు ఈ విధంగా చెక్ పెట్టేయండి !
విపరీతమైన చలి ఉన్నప్పుడు శరీరం పొడిబారుతుంది.అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు , దుమ్ము-ధూళి కాలుష్యం మొదలైన కారణాల వల్ల కాళ్ల మడమలలో పగుళ్లు ఏర్పడతాయి. మరి చీలమండల పగుళ్లు ఏర్పడినపుడు కొంతమంది పట్టించుకోకుండా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. అది రక్తస్రావంతో పాటు, మంట మరియు నొప్పికి దారితీస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పాటించాలిసిన వంటింటి చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాము.
దిశ , వెబ్ డెస్క్ : శీతాకాలం వచ్చిందంటే చాలు శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చర్మంపై పగుళ్లు ఏర్పడటం, శరీరం పొడిబారిపోవడం ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తుంటాయి. అయితే వీటిని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల ఇబ్బందికరంగా మారతాయి. విపరీతమైన చలి ఉన్నప్పుడు శరీరం పొడిబారుతుంది.అలాగే శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు , దుమ్ము-ధూళి కాలుష్యం మొదలైన కారణాల వల్ల కాళ్ల మడమలలో పగుళ్లు ఏర్పడతాయి. మరి చీలమండల పగుళ్లు ఏర్పడినపుడు కొంతమంది పట్టించుకోకుండా వారి పనులు వారు చేసుకుంటూ ఉంటారు. అది రక్తస్రావంతో పాటు, మంట మరియు నొప్పికి దారితీస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పాటించాలిసిన వంటింటి చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాము.
అరటి పండు గుజ్జు
బాగా పండిన అరటిపండు గుజ్జును తీసుకోని మెత్తగా చేసి పగుళ్లపై రాయండి. అలాగే ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి.కొంత సేపటి తర్వాత పాదాలను సాధారణ నీళ్లతో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల కూడా పగుళ్లు తొందరగా నయం అవుతాయి.
ఆముదం
పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత ఆముదం రాస్తే, మడమల పగుళ్లు నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇంగువ
ఒక గిన్నెలో కొంచెం ఇంగువ తీసుకుని దానిలో వేపనూనెను కలిపి రాత్రి పడుకునే ముందు కాళ్ల పగుళ్ల చోట రాయడం వలన పగుళ్లు తొందరగా తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి : వైవాహిక ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందా?