పొట్టలో ఈ లక్షణాలు ఉన్నాయా.. కడుపు క్యాన్సర్‌ కావొచ్చు..

క్యాన్సర్ ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధి. భారతదేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2024-04-20 09:51 GMT

దిశ, ఫీచర్స్ : క్యాన్సర్ ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధి. భారతదేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కడుపు క్యాన్సర్ కూడా ఒకటి. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు. మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రారంభంలో ప్రజలు దాని లక్షణాలను కనుగొనలేరు. ప్రారంభ దశలో దాని సంకేతాలు సాధారణ సమస్య లాగే ఉంటుంది. తర్వాత ఈ సమస్య క్రమంగా పెరుగుతూ రోగి పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది.

ఈ కడుపు క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. ఇంతకు ముందు వయసు పెరిగే కొద్దీ వచ్చే ఈ సమస్య ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తుంది. చాలా సందర్భాల్లో క్యాన్సర్ చాలా ఆలస్యంగా బయటపడుతుంది. అయితే ఈ కడుపు క్యాన్సర్ లక్షణాల గురించి ప్రజలకు తెలియకపోవడమే దీనికి కారణం. అంతటి భయంకరమైన కడుపు క్యాన్సర్ లక్షణాలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

స్టమక్ క్యాన్సర్ మొదట్లో కడుపు చుట్టుపక్కల ప్రాంతాల్లో నొప్పి మొదలవుతుందని. అయితే దీనిని గ్యాస్ సమస్యగా భావించి సొంతంగా మందులు వేసుకోవడం ప్రారంభిస్తారని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో చాలా కాలం పాటు కొనసాగే ఈ లక్షణం తర్వాత తీవ్రంగా మారుతుంది. అందుకే స్టమక్ క్యాన్సర్ అన్ని లక్షణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపు క్యాన్సర్ లక్షణాలు ఇవి

బరువు తగ్గడం

కడుపు నొప్పి రావడం

ఆకలి కాకపోవడం

ఆహారం మింగడంలో ఇబ్బంది కలగడం

వాంతులు కావడం

అలసట రావడం

గుండెల్లో మంటలు రావడం

తరచూ గ్యాస్ సమస్య ఎదురవడం

కొంచెం తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలగడం

కడుపు క్యాన్సర్ ఎందుకు వస్తుంది ?

హెచ్‌పైలోరీ బ్యాక్టీరియా వల్ల కడుపు క్యాన్సర్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా కడుపులోని కణాలను దెబ్బతీస్తుంది. ఈ చెడు కణాలు నెమ్మదిగా పెరగడం ప్రారంభిస్తాయి. కడుపులో కణితులను కూడా ఏర్పరుస్తాయి. దీని తరువాత ఇది శరీరంలోని ఇతర ప్రదేశాలకు వ్యాపిస్తుంది.

ఈ కారణాల వల్ల కూడా కడుపు క్యాన్సర్ రావచ్చు

ధూమపానం

ధూమపానం వల్ల కూడా కడుపు క్యాన్సర్ వస్తుందంటున్నారు నిపుణులు. మీరు ధూమపానం చేసినప్పుడు, దాని రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది కడుపు కణాలను ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అల్సర్, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఆహారం, పానీయం

తప్పుడు ఆహారపు అలవాట్లు కూడా కడుపు క్యాన్సర్‌కు ప్రధాన కారణం కావచ్చు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినే వ్యక్తులకు ఇతరులకన్నా కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఔషధాల దుష్ప్రభావాలు..

మందుల దుష్ప్రభావాల వల్ల కడుపు క్యాన్సర్ రావచ్చు. ఔషధాలలో అనేక రకాల రసాయనాలు ఉంటాయి. దీని వలన దుష్ప్రభావాలు కడుపు కణాలను దెబ్బతీస్తాయి.

కడుపు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు..

ఎండోస్కోపీ

జీవాణు పరీక్ష

సోనోగ్రఫీ

CT స్కాన్

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలి

ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి

పాత ఆహారం తినకూడదు

ధూమపానం చేయవద్దు

మీ కడుపుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

Tags:    

Similar News