రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగొచ్చా?
నీళ్లు తాగడం అనేది తప్పనిసరి. మనం ప్రతీ రోజు కనీసం నాలుగు లీటర్లైనా నీళ్లు తాగాలి అంటారు వైద్యులు. ఇక ప్రస్తుతం సమ్మర్ కాబట్టి ఎక్కువగా వాటర్ తాగాలంటున్నారు. అయితే కొందరు మాత్రం రాత్రి సమయంలో ఎక్కువగా నీరు తాగుతారు
దిశ, వెబ్‌డెస్క్ : నీళ్లు తాగడం అనేది తప్పనిసరి. మనం ప్రతీ రోజు కనీసం నాలుగు లీటర్లైనా నీళ్లు తాగాలి అంటారు వైద్యులు. ఇక ప్రస్తుతం సమ్మర్ కాబట్టి ఎక్కువగా వాటర్ తాగాలంటున్నారు. అయితే కొందరు మాత్రం రాత్రి సమయంలో ఎక్కువగా నీరు తాగుతారు, అయితే అలా నైట్ సమయంలో నీరు తాగకూడదు అంటారు.కాగా, అసలు రాత్రి సమయంలో నీరు తాగవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి పడుకునే ముందు నీరు త్రాగడం ప్రయోజనకరం కాదు. సాధారణంగా నిద్రించడానికి 1 గంట ముందు నీరు తాగాలంట. పడుకునే ముందు పాలు తాగడం వల్ల మేలు జరుగుతుంది. పాలు తాగడం వల్ల మీకు ప్రోటీన్ లభిస్తుంది, ఇది మీరు నిద్రిస్తున్నప్పుడు మీ శరీరానికి మేలు చేస్తుంది.
దాహం వేస్తే నీళ్లు తాగొచ్చు. కానీ దాహం వేయనప్పుడు నీరు తాగడం మానేయాలి. నీరు ఎక్కువగా తాగి వెంటనే నిద్రపోవడం వల్ల ముఖం, చేతులు, కాళ్ళు వాపుకు కారణమవుతాయంట. దీనిని నీటి నిలుపుదల లేదా ఎడెమా అంటారు. మలబద్ధకంతో బాధపడేవారు పడుకునే ముందు కొద్దిగా నీళ్లు తాగవచ్చని డైటీషియన్స్ చెబుతున్నారు. కానీ వారు ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో పుష్కలంగా నీరు త్రాగాలి. దీంతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Read more:
ఒంట్లో వేడితో బాధపడుతున్నారా.. పడుకునేముందు ఈ డ్రింక్ తీసుకోండి