అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీళ్లు తాగిస్తే ఏం జరుగుతుందో తెలుసా..

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి.

Update: 2024-05-09 14:30 GMT

దిశ, ఫీచర్స్ : దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు. తీవ్రంగా వీచే వేడిగాలుల కారణంగా, అధిక ఎండ కారణంగా మనిషి డీహైడ్రేట్ అవుతారు. దీంతో మనిషి మూర్ఛపోయే ప్రమాదం, గుండె సమస్యలు వచ్చేఅవకాశాలు ఉన్నాయి. అంతే కాదు ఎండల తీవ్రత కారణంగా ప్రజలు స్పృహ తప్పుతుంటారు. అయితే స్పృహ తప్పి అపస్మారక స్థితిలో ఉన్నవారిని స్పృహలో తీసుకు వచ్చేందుకు వారికి నీరు తాగించే ప్రయత్నం చేస్తుంటారు. అలా నీరు తాగించొచ్చా, అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఎలా స్పృహలోకి తీసుకురావాలి ఎలా ప్రథమ చికిత్స అందించాలో చాలామందికి తెలియదు. మరి ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్పృహ తప్పిన వారికి నీళ్లు తాగించకూడదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని విలువైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎవరైనా అకస్మాత్తుగా స్పృహ తప్పిన పరిస్థితి ఉంటే వారికి నీళ్లు ఇవ్వకూడదని తెలిపింది. అపస్మారక స్థితిలో ఉన్నవారికి నీళ్లు తాగించినప్పుడు వారు సరిగ్గా నీళ్లు తాగలేరని, నీళ్లు కడుపులోకి ప్రవేశించవని తెలిపారు. అలాంటి సమయంలో గుండెల్లో మంటలు కూడా రావొచ్చు. దీంతో వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవచ్చు. ఇది వారి ఆరోగ్యాన్ని ఇంతకింత దిగజార్చవచ్చు. అందుకే స్పృహ లేని వ్యక్తులకు నీళ్లు తాగించే ప్రయత్నాన్ని మానుకోవాలి.

వ్యక్తులు మూర్ఛపోతే ఏం చేయాలి..

వ్యక్తులు ఎవరైనా అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నప్పుడు ముందుగా వారి తలను చేతులతో పైకి లేపాలి. ఆ తర్వాత ముఖం మీద కొన్ని నీళ్లు చిలకరించాలి. ఆ తరువాత ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నారా, పల్స్ ఉందా లేదా అని చూడడం కంపల్సరీ. ఈ రెండూ ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఆరోగ్యం ఫర్వాలేదనుకోవాలి. స్పృహలేని వ్యక్తికి శ్వాస సరిగా రాకపోతే వెంటనే CPR చేయాలి.

CPR ఎలా చేయాలి..

రోగి ఛాతీ మధ్యలో ఎవరైనా రెండు అరచేతులను ఒకదాని పై ఒకటి పెట్టాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఛాతీని 1 నిమిషయంలో 100 నుండి 120 సార్లు ఛాతీని పుష్ చేయాలి. అలా రెండు మూడు సార్లు చేయడాన్ని CPR అని అంటారు. ఇలా చేయడం ద్వారా శరీర భాగాల్లో ఆక్సిజన్‌తో కూడిన రక్తం సరఫరా అవుతుంది. CPR ఇచ్చే సమయంలో అంబులెన్స్‌కు కాల్ చేయడం కూడా చాలా ముఖ్యం. CPR చేయడం ద్వారా ఆరోగ్యంగా ఆసుపత్రికి చేరే అవకాశాలు ఉంటాయి.

(గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్‌ నుంచి సేకరించినది. )

Read More...

మద్యం తాగే మహిళలను బయపెడుతున్న తాజా అధ్యయనం.. ఈ నిజాలు తెలిస్తే అంతే..? 


Similar News