నగ్నంగా నిద్రపోతే ఇన్ని లాభాలు ఉంటాయా..?
అదేంటి దుస్తులు వేసుకోకుండా నిద్రపోవాలా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అలా నిద్రిస్తే ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్: అదేంటి దుస్తులు వేసుకోకుండా నిద్రపోవాలా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును అలా నిద్రిస్తే ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రాత్రి సమాయాల్లో దుస్తులు వేసుకొనే నిద్రపోతాం. కానీ కొందరు శరీరం మీద ఏ వస్త్రం లేకుండా నిద్రపోవడానికి ఇష్టపడతారట. కుటుంబంతో కలిసి జీవించేవారిలో ఈ అలవాటు ఉండకపోవచ్చు. ఒంటరిగా లేదా జీవిత భాగస్వామితో కలిసి పడుకున్నప్పడు నగ్నంగా నిద్రపోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలా నగ్నంగా పడుకునే అలవాటు వినడానికి కొంచె చెత్తగా అనిస్తుంది. కానీ పరిశోధకులు మాత్రం నగ్నంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరగుతుందని చెబుతున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
దుస్తులు ధరించకుండా నగ్నంగా నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. రక్తం త్వరగా చల్లబడుతుంది. రోజంతా దుస్తులు వేసుకోవడం వల్ల చర్మంలోని కణాల పునరుద్ధరణకు కష్టమవుతుంది. దుస్తులు లేకుందా నిద్రపోతేనే అది సాధ్యమవుతుంది. దీనివల్ల చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గే అవకాశం ఉంది. మహిళల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఇన్నర్స్ వేసుకుని నిద్రపోవడం వల్ల ఈస్ట్ వంటి ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఉండవు. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.
Read more: వాటిని నీటిలో వేసుకుని స్నానం చేస్తే.. అదృష్టం వరించినట్లే