గుండెపోటు రాకుండా ఉండాలంటే అదొక్కటే మార్గం!
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య గణనీయంగా పెరిపోయింది. ముఖ్యంగా యువత ఎక్కువగా హార్ట్ స్ట్రోక్‌కు బలవుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య గణనీయంగా పెరిపోయింది. ముఖ్యంగా యువత ఎక్కువగా హార్ట్ స్ట్రోక్‌కు బలవుతున్నారు. గుండెపోటు రాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ఎమ్. అమరేశ్ రావు(హెచ్‌వోడీ, కార్డియో థెరఫిక్ సర్జరీ, నిమ్స్) సూచించారు. ‘బీపీ, షుగర్ వ్యాధులను కంట్రోల్ చేస్తే హార్ట్స్ట్రోక్ రిస్క్ తగ్గించేనట్టే. దీంతోపాటు లైఫ్స్టైల్లో మార్పులు రావాలి. ఆల్కహాల్, స్మోకింగ్, డగ్స్‌కు దూరంగా ఉండాలి. జంక్‌ఫుడ్, మసాల ఆహారాన్ని తగ్గించాలి.
ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలి. కొవిడ్, వ్యాక్సిన్లతో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయనే దానిపై ఇప్పటి వరకు సైంటిఫిక్ప్రూఫ్లేదు. ఆ ఛాన్స్‌కూడా తక్కువే. వాటి వలన ఏదైనా సైడ్ఎఫెక్ట్ కలిగితే గరిష్టంగా మూడు నెలలలోపు మాత్రమే సంభవిస్తాయి. ఇక గతంలో పోల్చితే ప్రజల్లో అవగాహన పెరగడం, వేగంగా డయాగ్నస్టిక్చేయడం, సోషల్‌మీడియా ప్రభావం పెరగడంతోనే హార్ట్స్ట్రోక్లు ఎక్కువగా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. చెడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ప్రతిరోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. మితిమీరిన జిమ్‌లు కూడా ప్రమాదమే’ అని డాక్టర్ అమరేశ్ రావు సూచించారు.
Read more:
యువతలో పెరుగుతున్న గుండెపోట్లు.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే?