లంగ్స్ సమస్యతో బాధపడుతున్నారా?.. క్లీన్ చేసే చిట్కా ఇదే!
ఊపిరి తీసుకోకపోతే మూడు నిమిషాల్లో మనిషి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. శరీరంలో అత్యంత మఖ్యమైనవి ఊపిరితిత్తులు. ఇవి ఆరోగ్యంగా ఉండి, ఆక్సిజన్ శరీరానికి సరిపడా అందితే వందేళ్లు ఆరోగ్యంతో బతకొచ్చు.
దిశ, వెబ్‌డెస్క్: ఊపిరి తీసుకోకపోతే మూడు నిమిషాల్లో మనిషి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. శరీరంలో అత్యంత మఖ్యమైనవి ఊపిరితిత్తులు. ఇవి ఆరోగ్యంగా ఉండి, ఆక్సిజన్ శరీరానికి సరిపడా అందితే వందేళ్లు ఆరోగ్యంతో బతకొచ్చు. కానీ, వాతావరణ కాలుష్యంతో, సిగరేట్లతో ఊపిరితిత్తులు బలవుతున్నాయి. న్యూమోనియా, బ్రాంకౌటిస్, ఆస్తమా, లంగ్ క్యాన్సర్, టీబీ, ఎంపసీమా, దగ్గు, జలుబు, డస్ట్ ఎలర్జీ లాంటివి ఊపిరితిత్తులను దెబ్బ తీస్తాయి. శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరం. ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థకు మూలాధారాలు. ఇంత ముఖ్యమైన ఈ ఊపిరితిత్తులు ధూమపానం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల పాడవుతున్నాయి. అయితే, వీటన్నిటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడేది ఆయుర్వేదం మాత్రమే అని నిపుణులు సూచిస్తున్నారు.
ఆయుర్వేదం రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఊపిరితిత్తులను సంపూర్ణ ఆరోగ్యంగా, అద్భుతంగా మారుస్తాయని చెబుతున్నారు. తులసి, యష్టిమధు, వసాక, అశ్వగంధ, బిల్వ, ఉసిరి, లవంగం, హరీతకి, విభీతకి, త్వక్, శిరీష, వస, శొంఠి, పిప్పలి, మరీచ, పుదీనా, కర్పూర, గుగ్గిలం, పుష్కరమూల, శృంగి లాంటి 21 మూలికలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి ప్రధానంగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల పాడయిన లంగ్స్‌ను క్లీన్ చేయడానికి దోహద పడుతుందని అంటున్నారు. వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకోవాలని చెబుతున్నారు.