ఇంట్రెస్టింగ్..సెల్ఫీ తో బయటపడ్డ ప్రాణాంతక వ్యాధి?
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీతో పాటు పరుగులు పెడుతున్నారు.ఒకప్పటి వారి జీవన విధానం ప్రజెంట్ వారి జీవనశైలిలో కూడా మార్పులు గమనిస్తూనే ఉన్నాం.అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
దిశ,వెబ్ డెస్క్:ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీతో పాటు పరుగులు పెడుతున్నారు.ఒకప్పటి వారి జీవన విధానం ప్రజెంట్ వారి జీవనశైలిలో కూడా మార్పులు గమనిస్తూనే ఉన్నాం.అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.ఏ ప్రదేశానికి వెళ్లిన సెల్ఫీ దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.అయితే అమెరికాకు చెందిన ఒక మహిళ న్యూయార్క్ లో పర్యటనకు వెళ్లింది.అక్కడ ఆమెకు ఒక వింత అనుభవం ఎదురైంది.సందర్శన సమయంలో సెల్ఫీ తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె విచిత్రమైన మార్పును గమనించింది.ఇది ఏంటి అని వెంటనే వైద్యున్ని సంప్రదించగా అది బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారించారు.నిజానికి ఇది అందరినీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.సెల్ఫీ తీసుకోవడం ద్వారా వ్యాధిని గుర్తించడం అంటే నమ్మాలా అనే సందేహం మీలో కలుగవచ్చు.కానీ ఇది నమ్మాల్సిందే.
సెల్ఫీతో బ్రెయిన్ ట్యూమర్ ఎలా తెలుస్తుందంటారా?
అమెరికాకు చెందిన 33ఏళ్ల మహిళ న్యూయార్క్ పర్యటనకు వెళ్లింది.అక్కడే ఉన్న తన బంధువులతో కలిసి న్యూయార్క్ అందాలను చూడాలని బయలుదేరారు.ఈ క్రమంలో ఒక అందమైన ప్లేస్ అదే సిక్స్త్ అవెన్యూలోని పూల్, ఫౌంటైన్‌ల వద్ద ఆమే సెల్ఫీ తీసుకుంటుండగా ఆ ఫొటోలో ఆమె కనురెప్ప వాలిపోయినట్టు ఉంది.దీంతో ఆమె షాక్ కి గురైంది. ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత న్యూరాలజిస్ట్‌ను సంప్రదించింది. ఆమె కు వెంటనే ఎమ్ఆర్ఐ చికిత్స చేయించారు.ఆ చికిత్స అనంతరం రిపోర్ట్స్ వచ్చాయి. అందులో ఆ మహిళ కు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది.ఇది మెదడులో ఒక కణితిగా ఏర్పడిందని వైద్యులు తెలిపారు.ప్రజెంట్ ఎలాంటి అపాయం లేదనీ చెప్పారు.కానీ ఈ కణితి వేగంగా పెరుగుతుందనీ, తక్షణమే చికిత్స చేసుకోవాలని ఆమెకు సూచించారు.