కరోనా కట్టడిలో కాసర్‌గోడ్ ఆదర్శనీయం : కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఆ జిల్లాకు ప్రత్యేకంగా పలుసమస్యలున్నా వాటిని అధిగమించి ఈ మహమ్మారిని ధీటుగా ఎదుర్కొన్నదని తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శనివారం ఇక్కడ మాట్లాడుతూ.. కాసర్‌గోడ్ జిల్లా తీసుకున్న కరోనా కట్టడి చర్యలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ జిల్లాలోని 168 కరోనా పేషెంట్‌లలో 113 మంది కోలుకున్నారని చెప్పారు. ముఖ్యంగా సరైన విధంగా ఆరోగ్య […]

Update: 2020-04-18 09:57 GMT

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఆ జిల్లాకు ప్రత్యేకంగా పలుసమస్యలున్నా వాటిని అధిగమించి ఈ మహమ్మారిని ధీటుగా ఎదుర్కొన్నదని తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శనివారం ఇక్కడ మాట్లాడుతూ.. కాసర్‌గోడ్ జిల్లా తీసుకున్న కరోనా కట్టడి చర్యలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ జిల్లాలోని 168 కరోనా పేషెంట్‌లలో 113 మంది కోలుకున్నారని చెప్పారు. ముఖ్యంగా సరైన విధంగా ఆరోగ్య వ్యవస్థ పనిచేయడంతో.. అక్కడ ఒక్కరూ ఈ వైరస్ కారణంగా మృతి చెందలేదని తెలిపారు. అదీగాక, ఇప్పుడున్న పేషెంట్‌లు కూడా కోలుకునే అవకాశమున్నదని అన్నారు. ఈ జిల్లా ఎదుర్కొన్న పలుసవాళ్లను ఆయన ఏకరువుపెడుతూ.. ఈ జిల్లా వాసులు అధికంగా విదేశాలకు వెళుతుంటారు. కొందరు చదువుల కోసం వెళ్తే చాలా మంది మధ్యప్రాచ్య దేశాలకు పనుల కోసం వెళ్తుంటారని చెప్పారు. తొలిసారి (ఫిబ్రవరి ప్రాంతంలో..) చైనాలో చదువుకుంటున్న విద్యార్థితో ఈ వైరస్ ఎంటర్ అవ్వగా.. రెండో దశలో గల్ఫ్‌ నుంచి వచ్చినవారితో(మార్చి మధ్యలో) వైరస్ వ్యాప్తి ఊపందుకున్నది. ఈ జిల్లా ముఖ్య నగరాలకు, రాజధానికి దూరంగా ఉండటంతో పలుమౌలిక సదుపాయాలకు దూరంగానే ఉండిపోయింది. అదీగాక, విమానాశ్రయాల నుంచి కార్మికులు ఎక్కడెక్కడకు వెళతారో కనిపెట్టడం కష్టతరం. కానీ, ఇవన్నీ ప్రభుత్వం, అధికారులు, ప్రజల సమన్వయంతో అధిగమించిందని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగి ఒకరిని ఆ జిల్లా సంక్షోభాన్ని హ్యాండిల్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది. ఆయన క్షేత్రస్థాయి నుంచి సెక్రెటేరియట్ వరకు వారధిగా పనిచేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. కరోనా బాధితులు, అనుమానితుల కోసం ఆశా వర్కర్‌లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌లతో ఇంటింటి సర్వే చేపట్టారు. మొత్తం 17,300 కరోనా పాజిటివ్ వ్యక్తుల కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌లోకి పంపించారు. విదేశాలకు వెళ్లొచ్చినవారందరినీ జిల్లా యంత్రాంగం.. హోమ్ క్వారంటైన్‌లోనే ఉంచింది. హోమ్ క్వారంటైన్‌లో ఉన్నవారిని డ్రోన్‌ల సహాయంతో పర్యవేక్షించింది. క్లస్టర్ జోన్‌లను రెడ్ కోడింగ్‌లతో గుర్తించింది. అత్యవసర సరుకులన్నీ నేరుగా ప్రజల ఇంటికి చేరేలా బాధ్యత తీసుకుని నిర్వర్తించింది. వైరస్ చైన్‌ను తెంపేందుకు సామాజిక దూరం పాటించాలని విస్తృతంగా అవగాహన కల్పించింది. నాలుగు రోజుల్లోనే కొవిడ్ కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేయడం, ఐసీయూ సదుపాయాలను, కాసర్‌గోడ్ మెడికల్ కాలేజీని ఈ మహమ్మారి పేషెంట్‌లకోసం అందుబాటులోకి తీసుకొచ్చిందని అగర్వాల్ తెలిపారు.

Tags: kasargod, kerala, district, lav agarwal, health ministry

Tags:    

Similar News