రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం : ఈటల

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్మీ విమానాల సాయంతో ఆక్సిజన్ తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం మనవద్ద ఆక్సిజన్ కొరత లేదన్నారు. అవసరమైన అన్ని జిల్లాలకు ఆక్సిజన్ తరలిస్తున్నామని వివరించారు. పెరుగుతున్న కొవిడ్ కేసులకు అనుగుణంగా మనకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం పడుతుంటే, రోజుకు 400 […]

Update: 2021-04-27 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్మీ విమానాల సాయంతో ఆక్సిజన్ తీసుకొస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం మనవద్ద ఆక్సిజన్ కొరత లేదన్నారు. అవసరమైన అన్ని జిల్లాలకు ఆక్సిజన్ తరలిస్తున్నామని వివరించారు.

పెరుగుతున్న కొవిడ్ కేసులకు అనుగుణంగా మనకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం పడుతుంటే, రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రాణవాయువు పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీ, టిమ్స్, ఖమ్మం, భద్రాచలం, కరీంనగర్ ఆస్పత్రులకు ఇప్పటికే ఆక్సిజన్ మెషిన్లను పంపించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదన్నారు.

Tags:    

Similar News