పోలీసులు పనిచేసే చోటే ఆరోగ్య పరీక్షలు…

           సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్ సూచన మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి శనివారం ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ (W&CSW) డీసీపీ అనసూయ ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో యశోదా హాస్పిటల్స్, FMS డెంటల్ హాస్పిటల్, Dr.Eye Agarwal హాస్పిటల్స్ పాల్గొన్నారు. వీరిచే బీపీ, షుగర్,ఈసీజీ, అల్ర్టాసౌండ్, pap smear, […]

Update: 2020-02-15 04:52 GMT

సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్ సూచన మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు, కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బందికి శనివారం ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ (W&CSW) డీసీపీ అనసూయ ప్రారంభించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో యశోదా హాస్పిటల్స్, FMS డెంటల్ హాస్పిటల్, Dr.Eye Agarwal హాస్పిటల్స్ పాల్గొన్నారు. వీరిచే బీపీ, షుగర్,ఈసీజీ, అల్ర్టాసౌండ్, pap smear, Dental check-up etc., వివిధ పరీక్షలు నిర్వహించారు. రేడియాలజిస్ట్, ఆంకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, డెంటల్ చెకప్, కంటి పరీక్షల డాక్టర్లుతో కన్సల్టేషన్ ఏర్పాటు చేశారు. ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఆరోగ్య భద్రత ద్వారా చికిత్సలు చేసుకోవచ్చని డాక్టర్లు సూచించారు. ఈ సందర్భంగా డీసీపీ అనసూయ మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలనలా, సిబ్బంది పనిచేసే చోటే ఆరోగ్య పరీక్షలు చేయాలనే నూతన ఒరవడికి నాంది పలికిన సైబరాబాద్ సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని, తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తగిన వైద్యం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ క్రైమ్స్-1 కవిత, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ 2 టీ. ఇందిర, అడిషనల్ డీసీపీ అడ్మిన్ లావణ్య ఎన్జెపీ, మహిళా పోలీస్ అధికారులు, డాక్టర్ రమ్య, డాక్టర్ శైలజా, డాక్టర్ సుష్మ, డాక్టర్ చైతన్య, డాక్టర్ ఫాతిమా, సీటీసీ డాక్టర్ సుకుమార్ & సీటీసీ డాక్టర్ సరిత తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News