రష్యా కరోనా వ్యాక్సిన్‌పై అనుమానం
దిశ, వెబ్ డెస్క్: రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్‌పై ఆరోగ్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో పరీక్షలు జరిపి వ్యాక్సిన్ ను ఎలా ఆమోదిస్తారని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను ప్రశ్నిస్తున్నారు. రష్యా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించలేదని వారు చెబుతున్నారు. వ్యాక్సిన్ తో వ్యాధి నిరోధక శక్తి ప్రభావం ఎలా ఉందని చెప్పలేదు, ఎంతమందిపై ట్రయల్స్ నిర్వహించారో స్పష్టత ఇవ్వలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ […]
దిశ, వెబ్ డెస్క్: రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్‌పై ఆరోగ్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో పరీక్షలు జరిపి వ్యాక్సిన్ ను ఎలా ఆమోదిస్తారని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ను ప్రశ్నిస్తున్నారు. రష్యా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించలేదని వారు చెబుతున్నారు. వ్యాక్సిన్ తో వ్యాధి నిరోధక శక్తి ప్రభావం ఎలా ఉందని చెప్పలేదు, ఎంతమందిపై ట్రయల్స్ నిర్వహించారో స్పష్టత ఇవ్వలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాగా, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ట్రయల్స్ -3 ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే.