తెలంగాణలో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన డీహెచ్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్(ఒమిక్రాన్ వైరస్) భయబ్రాంతులకు గురిచేస్తో్న్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ఆంక్షలు విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నాయి. ఇండియాలోనూ విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా.. దీనిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పందించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్(ఒమిక్రాన్ వైరస్) భయబ్రాంతులకు గురిచేస్తో్న్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ఆంక్షలు విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నాయి. ఇండియాలోనూ విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా.. దీనిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పందించారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అంతేగాకుండా.. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధిస్తారని వస్తోన్న వార్తల్లోనూ ఎంతమాత్రం నిజం లేదని, రాష్ట్రంలో ఎలాంటి లాక్‌డౌన్‌లు పెట్టబోమని స్పష్టం చేశారు.