ఎర్రని టమాటోతో ఎన్ని ప్రయోజనాలో..
దిశ, వెబ్‌డెస్క్ : టమాటో.. ప్రస్తుతం టమాటో లేని ఇల్లు, కూరగాయల కొట్టు ఉండదు. సాధారణంగా ప్రతి రోజు మన రోజూవారి వంటలలో ఉపయోగించే కూరగాయలలో టమాటో ఒకటి. అయితే ఈ టమాటో తినడానికి రుచిగా ఉండటమే కాదు.. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు టమాటాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఎన్నో రకాల జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఈ టమాటో వలన కలిగే ప్రయోజనాలు […]
దిశ, వెబ్‌డెస్క్ : టమాటో.. ప్రస్తుతం టమాటో లేని ఇల్లు, కూరగాయల కొట్టు ఉండదు. సాధారణంగా ప్రతి రోజు మన రోజూవారి వంటలలో ఉపయోగించే కూరగాయలలో టమాటో ఒకటి. అయితే ఈ టమాటో తినడానికి రుచిగా ఉండటమే కాదు.. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. ప్రతి రోజు టమాటాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఎన్నో రకాల జబ్బుల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఈ టమాటో వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..!
టమాటా తినడం వలన కలిగే ప్రయోజనాలు….
క్యాన్సర్ కణాలను తొలగిచడంలో టమాటాలు మంచి ఔషదంగా పనిచేస్తాయి. అంతే కాకుండా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడానికి టమాటాలు ఉపయోగపడుతాయి. టమాటాలో ఉండే విటమిన్ కె, కాల్షియం వల్ల ఎముకలు గట్టి బడడానికి.. బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇక రేచీకటి నివారణకు టమాటాలు బాగా ఉపగయోగపడతాయి. అంతే కాకుండా టమాటాలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
తేలికైన ఆహరం, వ్యాయామ ప్రణాళికలో ఉంటే, మీ రోజువారీ ఆహారంలో టమాటాలను ఎక్కువగా తీసుకోండి. ఇవి సలాడ్లు, కాసేరోల్స్, సాండ్ విచ్, ఇతర పదార్ధాలలో ఎక్కువ మోతాదులో ఉపయోగించే, మంచి స్నాక్ గా తయారవుతుంది. టమాటాలు నీరు, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండడం వల్ల వెయిట్ వాచర్లు వీటిని “ఫిల్లింగ్ ఫుడ్” అని పిలుస్తారు, ఎక్కువ కాలరీలు, కొవ్వులేకుండా వేగంగా పొట్టనింపే ఆహారాలలో ఇది ఒకటి. అంతే కాకుండా టామాటో చర్మాన్ని సంరక్షిస్తుంది. అందుకే ముఖానికి ఫేస్ ప్యాక్ లా చాలా ఎక్కువమంది సజెస్ట్ చేస్తారు. ముఖ్యంగా చక్కెర వ్యాధి ఉన్నవారికి వారి చక్కెర లెవెల్స్ ను అదుపులో ఉంచడానికి టమాటో ఎంతగానో సహకరిస్తుంది.