పుదీనాతో బెనిఫిట్స్..
దిశ, వెబ్‌డెస్క్: మనకు అందుబాటులో దొరికే ఆకుకూరల్లో పుదీనా ఒకటి. పలు కూరల్లో వేసే పుదీనా సువాసన బాగుంటుంది. పుదీనాలో ఔషధ గుణాలతో పాటు జీవక్రియను పెంపొందించే ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్న పుదీనా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పుదీనాను ఎలా తీసుకున్నా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పుదీనాను వేసవిలో మజ్జిగలో వేసుకుని తాగవచ్చు. సలాడ్స్‌లో వేసుకుని తినవచ్చు. లేదా పుదీనా టీ తాగవచ్చు. పుదీనా ఆకులు శరీరాన్ని […]
దిశ, వెబ్‌డెస్క్: మనకు అందుబాటులో దొరికే ఆకుకూరల్లో పుదీనా ఒకటి. పలు కూరల్లో వేసే పుదీనా సువాసన బాగుంటుంది. పుదీనాలో ఔషధ గుణాలతో పాటు జీవక్రియను పెంపొందించే ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్న పుదీనా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
పుదీనాను ఎలా తీసుకున్నా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పుదీనాను వేసవిలో మజ్జిగలో వేసుకుని తాగవచ్చు. సలాడ్స్‌లో వేసుకుని తినవచ్చు. లేదా పుదీనా టీ తాగవచ్చు. పుదీనా ఆకులు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మనం పుదీనాను ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరిచి వేగవంతం చేస్తుంది. పుదీనా ఆకుల్లో విటిమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉంటాయి. దీంతో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్, రోస్ మ్యారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. వీటి వల్ల అలర్జీలను నివారిస్తుంది. పుదీనాలో మెంతాల్ అధికంగా ఉండడం వల్ల గొంతులో గరగర వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. ఇక గర్భిణీ స్త్రీలకు పుదీనా ఎంతో మంచిది. ఉదయం పూట అసౌకర్యాన్ని, వికారాన్ని నివారించే లక్షణాలు పుదీనాలో ఉన్నాయి. దగ్గు అదే పనిగా వస్తుంటే పుదీనా ఆకుల రసం, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. కలరా సమస్య ఉంటే నిమ్మరసం, మామిడి రసం, తేనె కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
మౌత్ ఫ్రెషనర్స్‌లో పుదీనా ఆకుల్ను ఎక్కువగా వినియోగిస్తారు. పలు రకాల వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో పుదీనా ఎక్కువ శాతం వాడకంలో ఉంది. అంతే కాకుండా కాస్మొటిక్ కంపెనీలు ఈ పుదీనా ఆకుల రసాన్ని ఎన్నో క్రీములు, లోషన్లు, మందుల తయారీలో వాడుతున్నాయి.