మెంతుల వల్ల ఎన్ని లాభాలో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అద్భుత గుణాలు కలిగి ఉన్న మసాలా దినుసుల్లో మెంతులు ఒకటి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ.. మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. అలాగే మెంతి కూరను పప్పు, కూరలలో వాడుతుంటాం. ఈ మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులలో పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుంది. ఈ మెంతి ఆకుల్లో ఇనుము, విటమిన్-సీ, బి1, బి2, కాల్షియం కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అద్భుత గుణాలు కలిగి ఉన్న మసాలా దినుసుల్లో మెంతులు ఒకటి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ.. మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. అలాగే మెంతి కూరను పప్పు, కూరలలో వాడుతుంటాం. ఈ మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మెంతులలో పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుంది. ఈ మెంతి ఆకుల్లో ఇనుము, విటమిన్-సీ, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. వీటిలో యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
మెంతులను మెత్తని పొడిగా చేయాలి. ఈ పొడిని రోజూ ఒకే సమయంలో ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగాలి. దీంతో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలను కూడా నియంత్రించవచ్చు.
మలబద్ధకం
మలబద్ధకం సమస్యను తగ్గించుకునేందుకు మెంతులు చక్కని ప్రత్యామ్నాయం. ఓ టీస్పూన్ మెంతులను తీసుకుని కాసేపు నానబెట్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్నిరోజుల్లోనే ఈ సమస్య తగ్గుతుంది.
డయాబెటిస్‌ను అదుపు చేస్తుంది
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తరచూ మెంతులను వాడమని సలహా ఇస్తారు. ఎందుకంటే వీటికి మధుమేహాన్ని నియంత్రణ చేసే శక్తి ఉంది. కొన్ని మెంతులను తీసుకుని మెత్తని పొడిగా చేసి స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని ఆహారం తీసుకునే ముందు గ్లాసు నీరు, మజ్జిగలో కలిపి తీసుకుంటుండాలి. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది.
కీళ్ల నొప్పులకు చక్కని ఔషధం
మెంతులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల ఆర్థరైటిస్ తో బాధపడేవారికి నొప్పి నుండి ఉపశమనం కలుగుతోంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం వల్ల ఆ నొప్పుల నుండి చాలా వరకు తేరుకుంటారు.
జీర్ణశక్తి మెరుగు అవుతుంది
జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మెంతులు ఒక వరం వంటివి. జీర్ణ సమస్యలను తగ్గించుకునేందుకు మెంతులలను ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలోని సహజమైన జీర్ణశక్తిని పెంపొందించే అంశాలు జీర్ణాశయాన్నీ, ప్రేగుల పనితీరునూ మెరుగుపరుస్తాయి.
పాలిచ్చే తల్లులకు మంచి ఫలితాలు
డెలీవరీ అయిన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలో మెంతులు చక్కని పాత్రని పోషిస్తాయి. ఈ మెంతుల్లో తల్లిపాల ఉత్పత్తికి కారణమయ్యే ఫైటోఈస్ట్రోజన్ ఉంటుంది. మెంతులతో చేసిన టీని త్రాగడం వల్ల ఎంతో మేలు చేస్తుంది.
బరువు తగ్గేందుకు
మెంతులను మీ డైట్ మెనూలో చేర్చడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. రాత్రంతా మెంతులను నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. లేదా మెంతి పొడిని పెరుగులో కలిపి తిన్నా బరువు తగ్గడంలో సహాపడుతుంది.
చర్మ సౌందర్యానికి..
మెంతులు పొడిగా ఉండే లక్షణాలు తగ్గించి చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతిపొడిని కొద్దిగా నీటితో కలిపి ఒక పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖంపై పట్టించాలి. ఇలా రెగ్యూలర్‌గా చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.
జుట్టు రాలడం తగ్గించేందుకు
మెంతులు జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది. మెంతులను పెరుగులో నానబెట్టి.. ఉదయాన్నే గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి ఆరాకా నీటితో తలని కడగాలి. ఇది కాస్తా జిడ్డుగా ఉంటుంది. మొత్తం శుభ్రంగా కడిగాక.. ఆ తర్వాతి రోజూ షాంపు చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరవడమే కాకుండా బలంగా మారుతుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నా మెంతులను మీ జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది.