మంత్రి హరీశ్ ఇలాకాలో అధికారి అవినీతి బాగోతం..
దిశ, సిద్దిపేట : కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ అవినీతి బాగోతం బట్టబయలైంది. 2018-2019 అకాడమిక్ ఇయర్‌లో పాఠశాలకు చెందిన దాదాపు 60 మంది విద్యార్థులకు రవాణా ఖర్చులకు గాను ఒక్కొక్క విద్యార్థికి 6 వేల చొప్పున ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులను ఇప్పటి వరకు కూడా హెడ్ మాస్టర్ పేద విద్యార్థులకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై 22/04/2021 […]
దిశ, సిద్దిపేట : కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల హెడ్ మాస్టర్ అవినీతి బాగోతం బట్టబయలైంది. 2018-2019 అకాడమిక్ ఇయర్‌లో పాఠశాలకు చెందిన దాదాపు 60 మంది విద్యార్థులకు రవాణా ఖర్చులకు గాను ఒక్కొక్క విద్యార్థికి 6 వేల చొప్పున ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులను ఇప్పటి వరకు కూడా హెడ్ మాస్టర్ పేద విద్యార్థులకు ఇవ్వకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇదే విషయమై 22/04/2021 రోజున ఓ వ్యక్తి ఆర్‌టీఐ దరఖాస్తు చేశాడు. అయితే, అధికారులు కూడా ఆర్‌టీఐపై నేటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో ఇదే విషయమై ఎంఈవోకి ఆర్‌టీఐ దరఖాస్తు చేయగా 6 నెలలుగా సమాచారం ఇవ్వకుండా జాప్యం చేశారు. 60 మంది విద్యార్థుల రవాణా ఖర్చులకు సంబంధించిన లెక్కల ఆడిట్‌లో కూడా మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది.
గతంలో కూడా సదరు హెడ్ మాస్టర్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై మంగళవారం కుకునూర్‌పల్లి గ్రామానికి చెందిన ఉమర్ ఖాన్ దీనిపై వివరణ కోరగా విషయాన్ని దారి తప్పించినట్లు తెలుస్తోంది. అవినీతికి పాల్పడిన హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలంటూ యువకుడు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం సిద్దిపేట జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ముగ్గురు అధికారులతో సదరు హెచ్ఎంపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు.