హెడ్‌మాస్టర్ రూ.10 లక్షల విరాళం
దిశ నల్లగొండ: కరోనా వైరస్ నియంత్రణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ రూ. 10 లక్షల విరాళం అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బత్తిని పరమేశ్వర్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడ్పాటునందించాలని భావించారు. అందులో భాగంగా రూ. 10 లక్షలను విరాళంగా అందజేశారు. సంబంధిత చెక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ […]
దిశ నల్లగొండ: కరోనా వైరస్ నియంత్రణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ రూ. 10 లక్షల విరాళం అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బత్తిని పరమేశ్వర్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడ్పాటునందించాలని భావించారు. అందులో భాగంగా రూ. 10 లక్షలను విరాళంగా అందజేశారు. సంబంధిత చెక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్‌కు మంగళవారం అందజేశారు.
Tags: cm relief fund, headmaster, minister ktr, ts news