కానిస్టేబుల్ రాసలీలలు.. నలుగురితో పెళ్లి.. నాలుగు సార్లు అబార్షన్..
దిశ, ఉత్తరాంధ్ర : అతనో పోలీస్.. సమాజంలో కీలక స్థానంలో ఉన్న అతడు దారి తప్పాడు. తాను పోలీస్ కాబట్టి తనను ఎవరూ అడగరు అనో లేక ఏమీ చేయలేరని అకున్నాడో ఏమో ఏకంగా నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని..ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక భార్య తెలుసుకుని అతడి బండారం బయటపెట్టింది. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నంలో వెలుగులోకి […]
దిశ, ఉత్తరాంధ్ర : అతనో పోలీస్.. సమాజంలో కీలక స్థానంలో ఉన్న అతడు దారి తప్పాడు. తాను పోలీస్ కాబట్టి తనను ఎవరూ అడగరు అనో లేక ఏమీ చేయలేరని అకున్నాడో ఏమో ఏకంగా నిత్య పెళ్లికొడుకు అవతారమెత్తాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని..ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక భార్య తెలుసుకుని అతడి బండారం బయటపెట్టింది. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. అప్పలరాజు అనే వ్యక్తి సీసీఆర్‌బీలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా నలుగురుని పెళ్లి చేసుకున్నాడు. నలుగురు మహిళలతో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చాడు. అయితే ఈ నలుగురిలో పద్మ అనే మహిళకు నాలుగుసార్లు అబార్షన్ చేయించాడు. దీంతో పద్మకు అప్పలరాజుపై అనుమానం కలిగింది. ఇంతలో మరో మహిళా కానిస్టేబుల్‌తో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పద్మ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజును నిలదీసింది. దీంతో అప్పలరాజు రెచ్చిపోయాడు. పద్మను వేధించడం, బెదిరించడం చేశాడు.
వేధింపులు తీవ్రమవ్వడంతో పద్మ.. మహిళా సంఘాలను ఆశ్రయించింది. మహిళా సంఘాల సహకారంలో పద్మ విశాఖలోని దిశా పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్ అప్పలరాజుపై ఫిర్యాదు చేసింది. ఈ విచారణలో భాగంగా నలుగురు మహిళలను అప్పలరాజు పెళ్లాడినట్టు తెలిసింది. మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అప్పలరాజును అరెస్ట్ చేసి ఉద్యోగం నుంచి తొలగించాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.