విలువైన కెమెరాలు అద్దెకు తీసుకొని పరార్.. చివరికి..
దిశ, ఖైరతాబాద్ : ఖరీదైన కెమెరాలను అద్దెకు తీసుకొని చోరీలకు పాల్పడుతున్న మోసగాన్ని క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 10 కెమెరాలు, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. లోతుకుంట హైదరాబాద్ కు చెందిన చుంచు ప్రవీణ్ కుమార్ (32) ఏడవ తరగతి వరకు చదువుకొని ప్రైవేటు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. అనంతరం యూసఫ్‌గూడా […]
దిశ, ఖైరతాబాద్ : ఖరీదైన కెమెరాలను అద్దెకు తీసుకొని చోరీలకు పాల్పడుతున్న మోసగాన్ని క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 10 కెమెరాలు, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. లోతుకుంట హైదరాబాద్ కు చెందిన చుంచు ప్రవీణ్ కుమార్ (32) ఏడవ తరగతి వరకు చదువుకొని ప్రైవేటు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. అనంతరం యూసఫ్‌గూడా లోని ఓ అకాడమీలో నటనలో శిక్షణ పొందాడు. చిన్న చిన్న సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో కెమెరాలు విలువైనవని తెలుసుకొని వాటిని చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఓఎల్ఎక్స్ (OLX)లో లోకేషన్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా కెమెరాలను అద్దెకు తీసుకుంటూ చోరీలకు పాల్పడేవాడు. వివిధ పేర్లపై ఆధార్ కార్డులు, ఇతర ఐడి కార్డులు సృష్టించి మోసాలకు చేసేవాడు. ఇతని మోసాలపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా మోసాలు పాల్పడగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించారు.
తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా మొదట తనకు ఏమీ తెలియదని బుకాయించాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించి పూర్తిస్థాయిలో విచారణ అనంతరం తాను చేసిన చోరీల చిట్టా విప్పాడు. దీంతో అతని వద్ద నుంచి 10 విలువైన కెనాన్ (Canon) కెమెరాలు, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకొని నిందితుని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.