HDFC నెట్ ప్రాఫిట్ రూ. 2,870 కోట్లు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద తనఖా సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(HDFC) 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 2,870.12 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 3,961.53 కోట్ల లాభాలతో పోలిస్తే ఈసారి 27.6 శాతం క్షీణత నమోదైనట్టు సంస్థ పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 11,727.96 కోట్లుగా నమోదైందని, గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 13,484.44 కోట్లుగా ఉందని […]

Update: 2020-11-02 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద తనఖా సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(HDFC) 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 2,870.12 కోట్లను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 3,961.53 కోట్ల లాభాలతో పోలిస్తే ఈసారి 27.6 శాతం క్షీణత నమోదైనట్టు సంస్థ పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 11,727.96 కోట్లుగా నమోదైందని, గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 13,484.44 కోట్లుగా ఉందని సంస్థ తెలిపింది.

ఈ త్రైమాసికంలో సంస్థ నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ. 3,647 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా ఈ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా, ఈ ఆర్థిక సంవత్సరం సగానికి 3.2 శాతంగా ఉన్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. మారటోరియం తర్వాత సెప్టెంబర్‌లో వ్యక్తి రుణాల సేకరణ సామర్థ్యం 96.3 శాతం ఉందని సంస్థ వెల్లడించింది. ఇక, ఈ త్రైమాసికంలో సెప్టెంబర్ 30 నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) రూ. 8,511 కోట్లని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 6.46 శాతం పెరిగి రూ. 2,046 వద్ద ట్రేడయింది.

Tags:    

Similar News