రూ. 23 డివిడెండ్ ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ. 3,180 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 42 శాతం అధికమని కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ నికర వడ్డీ ఆదాయం 14 శాతం పెరిగి రూ. 4,065 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ బోర్డు ఒక్కో […]

Update: 2021-05-07 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ గృహ రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ. 3,180 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 42 శాతం అధికమని కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ నికర వడ్డీ ఆదాయం 14 శాతం పెరిగి రూ. 4,065 కోట్లకు చేరుకుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ బోర్డు ఒక్కో షేర్‌కు రూ. 23 తుది డివిడెండ్‌కు ఆమోదం తెలిపింది. ఇక, ఈ త్రైమాసికంలో సంస్థ వ్యక్తిగత రుణాలు 19 శాతం పెరిగాయని, హై-ఎండ్ ప్రాపర్టీలకు డిమాండ్ అధికంగా నమోదైనట్టు కంపెనీ వివరించింది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా ఆర్థిక ఫలితాలు వెలువడటంతో శుక్రవారం కంపెనీ షేర్ ధర 2.4 శాతం పెరిగి రూ. 2,488.10 వద్ద ట్రేడయింది.

Tags:    

Similar News