కరుణానిధి జయంతి @HBD Father Of Corruption.. ట్విట్టర్ ట్రెండింగ్!

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 97వ జయంతి సందర్భంగా ట్విట్టర్‌లో ‘‘#HDB ఫాదర్ ఆఫ్ కరప్షన్’’ అనే పదం గురువారం ట్రెండింగ్‌లో నిలిచింది. ఈయన తమిళ ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా వెరీ పాపులర్ పొలిటీషియన్. రెండు దశాబ్దాల పాటు అనగా 1969 నుంచి 2011 వరకు ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కరుణానిధి సొంతం. 03 జూన్ 1924న జన్మించిన కరుణానిధి మొదట సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విషయం […]

Update: 2021-06-03 05:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 97వ జయంతి సందర్భంగా ట్విట్టర్‌లో ‘‘#HDB ఫాదర్ ఆఫ్ కరప్షన్’’ అనే పదం గురువారం ట్రెండింగ్‌లో నిలిచింది. ఈయన తమిళ ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా వెరీ పాపులర్ పొలిటీషియన్. రెండు దశాబ్దాల పాటు అనగా 1969 నుంచి 2011 వరకు ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కరుణానిధి సొంతం. 03 జూన్ 1924న జన్మించిన కరుణానిధి మొదట సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈయనకు ముగ్గురు భార్యలు కాగా, మొత్తం ఆరుగురు సంతానం. అయితే, ఇటీవల తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సుదీర్ఘ విరామం తర్వాత కరుణానిధి తనయుడు స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది.

కరుణానిధి జయంతిని పురస్కరించుకుని తమిళనాట డీఎంకే శ్రేణులు పెద్దఎత్తున వేడుకలు జరుపుతున్న సమయంలో ట్విట్టర్‌లో #HBD Father Of Corruption అనే ట్రెండ్ అవ్వడం పాత రోజులను గుర్తుచేస్తోంది. 2007లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆనాడు ప్రధాని మన్మోహన్ కేబినెట్‌లో కరుణానిధి కొడుకు ఎ.రాజా టెలికాం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2008లో 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో భాగంగా టెలికాం మంత్రిగా ఉన్న కరుణానిధి కొడుకు ఎ.రాజా భారీ అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఈ కేసులోనే కరుణానిధి కుమార్తై కనిమొళి, ఎ.రాజాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆనాడు 2G స్పెక్ట్రం కేసులో జరిగిన అవినీతి సుమారు 1లక్షా 76 వేల కోట్లు అని అంచనా. ఈ స్కాం యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. కరుణానిధి సంతానం వలన దేశం 1లక్షా 76 వేల కోట్లు నష్టపోయిందని యావత్ ప్రజానీకం నమ్మింది. ఈ కారణం వల్లే కరుణానిధి 97వ జయంతి సందర్భంగా ‘‘# HDB ఫాదర్ ఆఫ్ కరప్షన్’’ అనే వర్డ్‌ను తమిళ ప్రజలు తెగ ట్రెండింగ్ చేస్తున్నారు.

https://twitter.com/tamilthesiyamtn/status/1400341090209697796?s=20

Tags:    

Similar News