గతేడాది మాదిరే హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలు
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం(హెచ్‌సీయూ) ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో జరగనున్నాయి. గతేడాది మాదిరిగానే పెన్ను, పేపర్ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య అప్పారావు తెలిపారు. దేశవ్యాప్తంగా 38 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, పరీక్షకు రెండు గంటల సమయం కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కరోనా మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. నవంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు అప్పారావు పేర్కొన్నారు. ఇక, పీజీ […]
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం(హెచ్‌సీయూ) ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 24, 25, 26 తేదీల్లో జరగనున్నాయి. గతేడాది మాదిరిగానే పెన్ను, పేపర్ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య అప్పారావు తెలిపారు. దేశవ్యాప్తంగా 38 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, పరీక్షకు రెండు గంటల సమయం కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కరోనా మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. నవంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు అప్పారావు పేర్కొన్నారు.
ఇక, పీజీ విద్యా సంవత్సరానికి సంబంధించి రేపటి నుంచి (ఆగస్టు 20) ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెమిస్టర్ నమోదు చేసుకోవాలని అప్పారావు సూచించారు. డిసెంబర్ నెలాఖరికి ఆన్‌లైన్ సెమిస్టర్ పూర్తి చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.