ఫ్రెషర్లకు బంపర్ ఆఫర్.. ఆ ఐటీ కంపెనీలో 30 వేల ఉద్యోగాలు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ డిమాండ్, సరఫరా మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించేందుకు రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు కంపెనీ హెచ్ఆర్ విభాగం అధికారి వివి అప్పారావ్ అన్నారు. డిమాండ్‌కు తగినట్టుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏకంగా 30,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏటా సంస్థలో దాదాపు 40-50 శాతం ఫ్రెషర్లకు ఉద్యోగాలివ్వనున్నట్టు ఆయన తెలిపారు. గతేడాది హెచ్‌సీఎల్ టెక్‌లో దాదాపు […]

Update: 2021-07-26 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ డిమాండ్, సరఫరా మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించేందుకు రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు కంపెనీ హెచ్ఆర్ విభాగం అధికారి వివి అప్పారావ్ అన్నారు. డిమాండ్‌కు తగినట్టుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏకంగా 30,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏటా సంస్థలో దాదాపు 40-50 శాతం ఫ్రెషర్లకు ఉద్యోగాలివ్వనున్నట్టు ఆయన తెలిపారు. గతేడాది హెచ్‌సీఎల్ టెక్‌లో దాదాపు 14-22 వేల మధ్య ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకున్నామని, ప్రస్తుత ఏడాదిలో 20-22 వేల మంది ఫ్రెషర్లను తీసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వివి అప్పారావు వివరించారు.

ప్రతి ఏడాది 40-50 శాతం కొత్తవాళ్లతో 2022-23 నాటికి 30 వేల మంది వరకు కొత్తవారిని తీసుకుంటామన్నారు. హెచ్‌సీఎల్ టెక్‌లో మొత్తం 1.76 లక్షల మంది ఉద్యోగులున్నారని, ప్రస్తుతానికి 35 శాతం మంది కొత్తవారు, 65 శాతం అనుభవం కలిగిన ఉద్యోగులున్నారని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ఫ్రెషర్ల సంఖ్యను 70 శాతానికి పెంచాలని కంపెనీ భావిస్తోందని వెల్లడించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి కాలేజీల నుంచి హెచ్‌సీఎల్ టెక్ ఎక్కువ సంఖ్యలో ఫ్రెషర్లను తీసుకుంటుందని, ఈ ఏడాది ఐఐటీల నుంచి దాదాపు 206 మందిని తీసుకోనున్నట్టు అప్పారావు తెలిపారు. గతేడాది ఐఐటీల నుంచి వీరి సంఖ్య 304గా ఉంది.

ప్రధానంగా దేశంలోని ప్రధానమైన టాప్ 200 కాలేజీల నుంచి ఫ్రెషర్లకు ఉద్యోగాలిచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోందని ఆయన చెప్పారు. కాగా, ఇటీవల హెచ్‌సీఎల్‌ టెక్ కంపెనీలోని ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగికి బెంజ్ కార్లను కానుకగా ఇవ్వనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News