6 శాతం తగ్గిన హెచ్‌సీఎల్ లాభాలు

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 6.1 శాతం క్షీణించి రూ. 2,962 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 3,154 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 25.6 శాతం క్షీణించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5.7 శాతం పెరిగి రూ. 19,642 కోట్లకు చేరుకుందని, […]

Update: 2021-04-23 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 6.1 శాతం క్షీణించి రూ. 2,962 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 3,154 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 25.6 శాతం క్షీణించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5.7 శాతం పెరిగి రూ. 19,642 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 18,590 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు పేర్కొంది.

ఇక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ నికర లాభం 17.6 శాతం పెరిగి రూ. 13,011 కోట్లకు చేరుకోగా, ఆదాయం 6.7 శాతం పెరిగి రూ. 75,379 కోట్లుగా నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నట్టు తెలిపింది. కంపెనీ ఒక్కో షేర్‌కు రూ. 6 డివిడెండ్‌ను ప్రకటించింది. అదనంగా కంపెనీ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటినందుకు గాను కంపెనీ బోర్డు ప్రతి షేర్‌కు రూ. 10 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం కంపెనీ షేర్లు 0.56 శాతం తగ్గి రూ. 955.80 వద్ద ట్రేడయ్యాయి.

Tags:    

Similar News