‘రెండో త్రైమాసికంలో… పనితీరు మెరుగవుతుంది’

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ పనితీరు మెరుగ్గా ఉంటుందని ఐటీ సేవల దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఆదాయంతో పాటు నిర్వహణ మార్జిన్లు అంచనాలను అందుకుంటాయని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయ వృద్ధి 3.5శాతం పెరగనున్నట్టు కంపెనీ అంచనా వేసింది. అలాగే ఎబిట్ మార్జిన్లు 20.5 నుంచి 21 శాతం మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. కంపెనీ పనితీరు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఆదాయం అనుకున్నదానికంటే ఎక్కువ […]

Update: 2020-09-14 09:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ పనితీరు మెరుగ్గా ఉంటుందని ఐటీ సేవల దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అభిప్రాయపడింది. ముఖ్యంగా ఆదాయంతో పాటు నిర్వహణ మార్జిన్లు అంచనాలను అందుకుంటాయని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయ వృద్ధి 3.5శాతం పెరగనున్నట్టు కంపెనీ అంచనా వేసింది. అలాగే ఎబిట్ మార్జిన్లు 20.5 నుంచి 21 శాతం మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.

కంపెనీ పనితీరు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో ఆదాయం అనుకున్నదానికంటే ఎక్కువ ఉండొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల సేవలు మెరుగ్గా ఉన్నాయని, కంపెనీకి చెందిన లైఫ్ సైన్సెస్, టెలికాం, హెల్త్ కేర్, ఫైనాన్షియల్, మీడియా సేవల విభాగంలో కంపెనీ అందించే ఐటీ సేవలు మళ్లీ మెరుగుపడ్డాయని, కావున ఈ త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News