అల్లుకున్న నిర్లక్ష్యం.. చోద్యం చూస్తున్న విద్యుత్ అధికారులు

దిశ,మేళ్లచెరువు: విద్యుత్ సరఫరాలో నష్టాలను నివారించేందుకు కరెంట్ స్తంభాలు, తీగల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. కాగా ఈ విషయంలో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. మేళ్లచెరువు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. తీగ మొక్కలు పై వరకు ఎగబాకి వైర్లతో పాటు విద్యుత్ స్తంభాన్ని పూర్తిగా కమ్మేశాయి. నిత్యం రద్దీగా ఉండే […]

Update: 2021-11-26 02:32 GMT

దిశ,మేళ్లచెరువు: విద్యుత్ సరఫరాలో నష్టాలను నివారించేందుకు కరెంట్ స్తంభాలు, తీగల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి. కాగా ఈ విషయంలో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. మేళ్లచెరువు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. తీగ మొక్కలు పై వరకు ఎగబాకి వైర్లతో పాటు విద్యుత్ స్తంభాన్ని పూర్తిగా కమ్మేశాయి.

నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతాల్లో నెలలు గడుస్తున్న విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. వర్షాలు పడినపుడు తీగ మొక్కలకు విద్యుత్ సప్లయ్ కావడం వల్ల పశువులు చనిపోయే ప్రమాదం ఉందని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News