ధోనీని ప్రశ్నించేంత ధైర్యమా? నో నో!

దిశ, స్పోర్ట్స్: ఎవరైనా ఒక క్రికెటర్ సెంచరీ బాది.. జట్టును గెలిపించి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కూడా జట్టులో స్థానం కోల్పోతాడని ఊహించారా. తాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తదుపరి మ్యాచ్ నుంచి వరుసగా బెంచ్‌కే పరిమితమవుతాడని భావిస్తారా..? కానీ, మనోజ్ తివారీకి అలాంటి అనుభవమే ఎదురైంది. 2011లో వెస్టిండీస్ జట్టుపై సెంచరీ చేసి జట్టును గెలిపించిన తివారీ ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్‌ల పాటు […]

Update: 2020-05-14 05:48 GMT

దిశ, స్పోర్ట్స్: ఎవరైనా ఒక క్రికెటర్ సెంచరీ బాది.. జట్టును గెలిపించి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత కూడా జట్టులో స్థానం కోల్పోతాడని ఊహించారా. తాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తదుపరి మ్యాచ్ నుంచి వరుసగా బెంచ్‌కే పరిమితమవుతాడని భావిస్తారా..? కానీ, మనోజ్ తివారీకి అలాంటి అనుభవమే ఎదురైంది. 2011లో వెస్టిండీస్ జట్టుపై సెంచరీ చేసి జట్టును గెలిపించిన తివారీ ఆ తర్వాత వరుసగా 14 మ్యాచ్‌ల పాటు బెంచ్‌కు పరిమితమమయ్యాడు. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారని అప్పటి కెప్టెన్ ధోనీని ప్రశ్నించేంత ధైర్యం కూడా లేకపోవడంతో అలా బెంచ్‌పై కూర్చున్నానని గుర్తు చేసుకున్నాడు. రాబోయే వరల్డ్ కప్ కోసం జట్టు కూర్పుపై అప్పుడు ధోనీ పలు ప్రయోగాలు చేస్తున్నాడు. అందుకే తనకు మరో ఛాన్స్ ఇవ్వట్లేదని అనుకున్నాను. కానీ తనను ఎందుకు తీసేశావనే చిన్న ప్రశ్న కూడా అడగలేకపోయాను అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు. కానీ ధోనీ అంటే తనకు కోపం లేదని.. ఆనాటి నిర్ణయాన్ని తాను గౌరవించానని చెప్పుకొచ్చాడు. టీం ఇండియా తరపున 12 వన్డేలు, మూడు టీ20లు ఆడిన తివారి చివరి సారిగా 2015లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు.

Tags:    

Similar News