మానవత్వం అంటే ఇదే.. ఈ సర్పంచ్‌కు హ్యాట్సఫ్

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలామంది ముందుకు రావడం లేదు. మృతదేహాం దగ్గరికి వచ్చేందుకు కూడా చాలామంది భయపడిపోతున్నారు. ఆస్పత్రుల్లో అయితే ఇలాంటి మృతదేహాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కొంతమంది మానవత్వం చాటుకుంటున్నారు. ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు […]

Update: 2021-05-14 09:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలామంది ముందుకు రావడం లేదు. మృతదేహాం దగ్గరికి వచ్చేందుకు కూడా చాలామంది భయపడిపోతున్నారు. ఆస్పత్రుల్లో అయితే ఇలాంటి మృతదేహాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కొంతమంది మానవత్వం చాటుకుంటున్నారు. ముందుకొచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు భయంతో ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ మానవత్వం చాటుకున్నాడు. గ్రామ సర్పంచ్ కర్నె లక్ష్మీనారాయణ పీపీఈ కిట్టు ధరించి పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ , మరో నలుగురు యువకులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించాడు.

యువకుడి మృతదేహాన్ని ఇంటి నుండి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడే జెసిబి సాయంతో గోతి తీసి అంత్యక్రియలను పూర్తి చేశారు. మానవత్వం చాటిన సర్పంచ్‌ను పలువురు అభినందించారు.

Tags:    

Similar News