టోక్యో ఒలంపిక్స్ అధ్యక్షురాలిగా సీకో హషిమొతో
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షురాలిగా సీకో హషిమొతో (56) నియమితులయ్యారు. గురువారం జరిగిన టోక్యో ఒలంపిక్ కమిటీ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇన్నాళ్లు కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న జపాన్ మాజీ ప్రధాని యొషిరో మోరీ గత వారం తన పదవికి రాజీనామా చేశారు. మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. కాగా, కొత్తగా నియమించబడిన సీకో హషిమొతో ప్రస్తుతం జపాన్ ప్రధాని యొషిహిదే సుగా […]
దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షురాలిగా సీకో హషిమొతో (56) నియమితులయ్యారు. గురువారం జరిగిన టోక్యో ఒలంపిక్ కమిటీ సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇన్నాళ్లు కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న జపాన్ మాజీ ప్రధాని యొషిరో మోరీ గత వారం తన పదవికి రాజీనామా చేశారు. మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. కాగా, కొత్తగా నియమించబడిన సీకో హషిమొతో ప్రస్తుతం జపాన్ ప్రధాని యొషిహిదే సుగా క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్నారు.
గతంలో ఏడు సార్లు ఒలంపిక్స్‌లో అథ్లెట్‌గా ఆమె పాల్గొన్నారు. మూడు సార్లు వేసవి ఒలంపిక్స్‌లో సైక్లింగ్ విభాగంలో, నాలుగు సార్లు వింటర్ ఒలంపిక్స్‌లో స్పీడ్ స్కేటింగ్‌లో పాల్గొన్నారు. 1992 వింటర్ ఒలంపిక్స్ 1500 మీటర్ల స్పీడ్ స్కేటింగ్‌లో ఆమె కాంస్య పతకాన్ని కూడా గెల్చుకున్నారు. జపాన్‌లోని హొక్కైదో నగరానికి సమీపంలో ఆమె 1964లో జరిగిన సమ్మర్ ఒలంపిక్స్ ప్రారంభానికి ఐదు రోజుల ముందు జన్మించారు. దీంతో ఆమెకు సీకో హషిమొతో అనే పేరు పెట్టారు. ‘సీకో’ అనగా ఒలంపిక్ జ్యోతి అని అర్థం.