పాక్ పేసర్‌కు ఆన్‌లైన్ ద్వారా వెన్నెముక చికిత్స

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ టీంలో కీలక సభ్యుడైన, పేసర్ హసన్ అలీకి వెన్నునొప్పి తగ్గకపోవడంతో సర్జరీ చేయించుకోవాలని వైద్యలు సూచించారు. అయితే అతడి వెన్నునొప్పి మామూలు థెరపీతో తగ్గిపోతుందని చెబుతున్నారు. గత రెండు వారాలుగా అతడి నొప్పి తీవ్రతరం కావడంతో న్యూరో సర్జన్ అసిఫ్ బషిర్, స్పైనల్ థెరపిస్ట్ పీటర్ ఓస్లీవాన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మెడికల్ టీం అతడికి ఆన్‌లైన్ ద్వారా చికిత్స ప్రారంభించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్ టీం ఆస్ట్రేలియా పర్యటనకు […]

Update: 2020-06-08 05:48 GMT

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ టీంలో కీలక సభ్యుడైన, పేసర్ హసన్ అలీకి వెన్నునొప్పి తగ్గకపోవడంతో సర్జరీ చేయించుకోవాలని వైద్యలు సూచించారు. అయితే అతడి వెన్నునొప్పి మామూలు థెరపీతో తగ్గిపోతుందని చెబుతున్నారు. గత రెండు వారాలుగా అతడి నొప్పి తీవ్రతరం కావడంతో న్యూరో సర్జన్ అసిఫ్ బషిర్, స్పైనల్ థెరపిస్ట్ పీటర్ ఓస్లీవాన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మెడికల్ టీం అతడికి ఆన్‌లైన్ ద్వారా చికిత్స ప్రారంభించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పాక్ టీం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడే హసన్ అలీ వెన్నునొప్పి గాయమైంది. దీంతో అతడు పర్యటన నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు. ఆ తర్వాత ఖైద్ ఏ అజమ్ ట్రోఫీ సందర్భంగా వెన్నునొప్పి తిరగబెట్టింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ముందు అతను తిరిగి ఫిట్ నెస్ సాధించాడు. కానీ ఆ లీగ్ అనంతరం అతడిపై ఒత్తిడి ఎక్కువ కావడంతో మళ్లీ వెన్నునొప్పి పెరిగిపోయింది. దీంతో గత వారం నుంచి అతను ఆన్‌లైన్ ద్వారా చికిత్స తీసుకుంటున్నాడు. అతనికి రెండు గంటల థెరపీ కూడా చేసినట్లు పీసీబీ తెలిపింది. కరోనా మహమ్మరి తగ్గిన తర్వాత అతడికి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి.. అప్పుడు సర్జరీపై నిర్ణయం తీసుకుంటామని పీసీబీ స్పష్టం చేసింది. కాగా, అతను జట్టు నుంచి తప్పుకోవడంతో సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వలేదు. కాగా, అతడి చికిత్సకు అవసరమయ్యే ఆర్థిక సాయం మాత్రం చేస్తామని.. తిరిగి అతను జట్టులోకి అడుగుపెట్టే వరకు ఖర్చు భరిస్తామని పీసీబీ స్పష్టం చేసింది.

Tags:    

Similar News