ఆ జాబ్ కోసం పరీక్ష రాసినవారిలో 4925 మంది సెలెక్ట్.. ప్రకటించిన ప్రభుత్వం

దిశ, వెబ్ డెస్క్: హర్యానా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురందించింది. వివరాల్లోకి వెళితే.. హర్యానా స్టాఫ్ రిక్రూట్‌మెంట్ సెలక్షన్ కమిషన్ (HSSC) మహిళా కానిస్టేబుల్ దుర్గా శక్తి రిక్రూట్‌మెంట్ వ్రాత పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్ష కోసం లక్షా 66 వేల మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసినవారిలో 4,925 మంది మెరిట్‌లో చోటు దక్కించుకున్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ […]

Update: 2021-12-25 22:15 GMT

దిశ, వెబ్ డెస్క్: హర్యానా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపి కబురందించింది. వివరాల్లోకి వెళితే.. హర్యానా స్టాఫ్ రిక్రూట్‌మెంట్ సెలక్షన్ కమిషన్ (HSSC) మహిళా కానిస్టేబుల్ దుర్గా శక్తి రిక్రూట్‌మెంట్ వ్రాత పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్ష కోసం లక్షా 66 వేల మంది మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసినవారిలో 4,925 మంది మెరిట్‌లో చోటు దక్కించుకున్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్థుల ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) డిసెంబర్ 29న పంచకులలోని సెక్టార్-3లోని తౌదేవి లాల్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం నేటి నుంచి అడ్మిట్‌ కార్డుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 698 పోస్టులకు 11 జిల్లాల్లో డిసెంబర్ 12న రాత పరీక్ష నిర్వహించారు.

Tags:    

Similar News