ఫుట్‌పాత్‌లపై హరితహారం.. పాదాచారులు నడిచేదెలా..?
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని పాదాచారులు సరైన ఫుట్‌పాత్‌లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న కొన్ని చోట్ల కూడా సరైన మెయింటనెన్స్ లేకపోవడంతో వాటి వినియోగం అంతంతమాత్రంగానే మారింది. దీంతో పాదాచారులు రోడ్డుపై నడిచి నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. కొత్తగా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో దానికి తగ్గ చర్యలు కనిపించడం లేదు. నగరం మొత్తం దాదాపు 9 వేల కిలోమీటర్ల రోడ్డు ఉండగా అందులో 450 కిలో మీటర్లు మాత్రమే ఫుట్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని పాదాచారులు సరైన ఫుట్‌పాత్‌లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న కొన్ని చోట్ల కూడా సరైన మెయింటనెన్స్ లేకపోవడంతో వాటి వినియోగం అంతంతమాత్రంగానే మారింది. దీంతో పాదాచారులు రోడ్డుపై నడిచి నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. కొత్తగా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో దానికి తగ్గ చర్యలు కనిపించడం లేదు. నగరం మొత్తం దాదాపు 9 వేల కిలోమీటర్ల రోడ్డు ఉండగా అందులో 450 కిలో మీటర్లు మాత్రమే ఫుట్ పాత్‌లు నిర్మించారు. అవి కూడా చాలా వరకూ వీధి వర్తకులకు అడ్డాగా మారాయి. వాటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నించినా చాలా చోట్ల దర్శనమిస్తూనే ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ప్రస్తుతం నగరంలోని ఫుట్ పాత్‌లపై జరుగుతోంది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఫుట్‌పాత్‌లపై చెట్లు నాటడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లపై నాటిన మొక్కలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఎర్రగడ్డ నుంచి సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లే మార్గంలో రోడ్డుకి పక్కనున్న ఫుట్‌పాత్‌పై అడుగడుగికీ వేప చెట్టు నాటడం అటుగా వెళ్లే వారికి హాస్యాస్పందంగా మారింది. ఫుట్ పాత్ పై నాటడం ఒకటైతే మరీ యేపుగా పెరిగే వేప చెట్లను అంత దగ్గరగా నాటడం మరొకటి. రద్ధీగా ఉండే ఈ రోడ్డు పక్కనున్న ఫుట్ పాత్ పై చెట్లను పెట్టడంతో పాదాచారుల అవస్తలు అగమ్యగోచరం. దీంతో పాటు దుర్గం చెరువు మెట్రో, ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ ప్రాంతాల్లో మొక్కలు నాటారు.