తెలంగాణను బ్లేమ్ చేయొద్దు : హరీశ్ శంకర్
ప్రముఖ జర్నలిస్ట్, బిజినెస్ మెన్ శేఖర్ గుప్తాపై ఫైర్ అయ్యారు డైరెక్టర్ హరీశ్ శంకర్. తన హోటల్ బాల్కనీ పాడైపోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అని పరోక్షంగా విమర్శించారు శేఖర్ గుప్తా. విద్యుత్ అంతరాయంతో ఐటీ పార్క్‌కు డీజిల్ సెట్స్‌ను అమరుస్తున్నారని.. తద్వారా వచ్చే గాలి, పొగ, శబ్ధం వల్ల హోటల్ పాడైపోతుందని ట్వీట్ చేశాడు. దీనిపై మండిపడ్డ హరీశ్ శంకర్.. మీరు ఏదైనా చెడు ప్రచారం చేయాలనుకుంటే మరో కథను ఎంచుకోండి తప్పా… […]
ప్రముఖ జర్నలిస్ట్, బిజినెస్ మెన్ శేఖర్ గుప్తాపై ఫైర్ అయ్యారు డైరెక్టర్ హరీశ్ శంకర్. తన హోటల్ బాల్కనీ పాడైపోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అని పరోక్షంగా విమర్శించారు శేఖర్ గుప్తా. విద్యుత్ అంతరాయంతో ఐటీ పార్క్‌కు డీజిల్ సెట్స్‌ను అమరుస్తున్నారని.. తద్వారా వచ్చే గాలి, పొగ, శబ్ధం వల్ల హోటల్ పాడైపోతుందని ట్వీట్ చేశాడు.
దీనిపై మండిపడ్డ హరీశ్ శంకర్.. మీరు ఏదైనా చెడు ప్రచారం చేయాలనుకుంటే మరో కథను ఎంచుకోండి తప్పా… మా రాష్ట్రంపై తప్పుడు ఆరోపణలు చేసి బ్లేమ్ చేయొద్దని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు మేము పవర్ ఫుల్‌గా ఉన్నామని తెలిపారు. ఇలాంటి ఆరోపణలు మానుకుంటే మంచిదని హితవు పలికారు హరీశ్ శంకర్.
Tags: Harish Shankar, Shekhar Gupta, Telangana