'ఘరానా మొగుడు' చూసేందుకు చాలా కష్టపడ్డా
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్. తన సినిమాల రికార్డులను తానే బ్రేక్ చేసుకున్న హీరో చిరు. మెగాస్టార్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పక్కా… ఎమోషన్స్‌కు కొదువ ఉండదు. సూపర్ డూపర్ సాంగ్స్… దుమ్ముదులిపే స్టెప్స్. ఇలాంటి చిత్రాల్లో ‘ఘరానా మొగుడు’ ఒకటి. ఒక కంపెనీలో పని చేసే కార్మికుడు… ఆ కంపెనీ యజమాని కూతురికి మొగుడు కావడం.. ఆ క్రమంలో భార్యాభర్తలు(చిరు, నగ్మ)ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సాంగ్స్ సగటు ప్రేక్షకుడికి […]
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్. తన సినిమాల రికార్డులను తానే బ్రేక్ చేసుకున్న హీరో చిరు. మెగాస్టార్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పక్కా… ఎమోషన్స్‌కు కొదువ ఉండదు. సూపర్ డూపర్ సాంగ్స్… దుమ్ముదులిపే స్టెప్స్. ఇలాంటి చిత్రాల్లో ‘ఘరానా మొగుడు’ ఒకటి. ఒక కంపెనీలో పని చేసే కార్మికుడు… ఆ కంపెనీ యజమాని కూతురికి మొగుడు కావడం.. ఆ క్రమంలో భార్యాభర్తలు(చిరు, నగ్మ)ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సాంగ్స్ సగటు ప్రేక్షకుడికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగా… తల్లి సెంటిమెంట్‌తో కన్నీరు పెట్టించిన సన్నివేశాలు కట్టిపడేస్తాయి. చిరు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాను కె. దేవీ వరప్రసాద్ నిర్మించగా… తెలుగు చలనచిత్ర చరిత్రలో రూ. 10 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో రూ. కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు చిరు. ‘ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి’ అంటూ చిరు తన మ్యానరిజంతో ప్రేక్షకులు కొత్తదనాన్ని ఫీల్ కాగా… రావు గోపాలరావు, వాణీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో మెప్పించారు. ‘ఘరానామొగుడు’ రిలీజై 28 ఏళ్లు కాగా … తొలి రోజు ఈ సినిమా చూసేందుకు తాను పడిన కష్టాన్ని వివరించారు డైరెక్టర్ హరీశ్ శంకర్.
Morning show ki velthe… second show ki ticket dorikindhi….appatike repeat audience ochesaru….. port lo fight… song… ayye sariki blockbuster ani fix ayipoyaamone one of the best movies of Mega stars career !!! Thanks alot for inspiring Guruji..@krr7799 🙏@KChiruTweets https://t.co/pmmpnrgBNW
— Harish Shankar .S (@harish2you) April 9, 2020
మెగా మూవీ ‘ఘరానా మొగుడు’ సినిమా చూసేందుకు మార్నింగ్ షోకు వెళ్తే.. సెకండ్ షోకు టికెట్ దొరికిందని తెలిపాడు. అప్పటికే రిపీట్ ఆడియన్స్ వచ్చేశారన్నాడు. పోర్ట్‌లో ఫైట్, బంగారు కోడిపెట్ట సాంగ్ ఉండేసరికి… బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయామన్నాడు. మెగాస్టార్ కెరియర్‌లోని గొప్ప చిత్రాల్లో ఇది కూడా ఒకటని అభిప్రాయపడిన హరీశ్ శంకర్… మీ చిత్రాల ద్వారా మాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు గురూజీ అంటూ చిరుకు థాంక్స్ చెప్పాడు.
tags: Chiranjeevi, Harish Shankar, Gharana Mogudu, Telugu Cinema