వాహనాలను సీజ్ చేయించిన మంత్రి హరీశ్ రావు
దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తున్నందుకు ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని విక్టరీ టాకీసు సర్కిల్ నుంచి పలు వీధుల్లో తిరుగుతూ.. లాక్‌డౌన్ తీరును సోమవారం పరిశీలించారు. అనవసరంగా బయట తిరుగుతూ కనిపించిన వాహనా దారులతో మాట్లాడి.. వారిని ఎక్కడికి వెళ్తున్నారని మంత్రి మందలించారు. వారు చెప్పే సమాధానం అసంబద్ధతతో ఉన్నదని మూడు వాహనాలను సీజ్ చేయించారు. కరోనా […]
దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లా కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తున్నందుకు ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని విక్టరీ టాకీసు సర్కిల్ నుంచి పలు వీధుల్లో తిరుగుతూ.. లాక్‌డౌన్ తీరును సోమవారం పరిశీలించారు. అనవసరంగా బయట తిరుగుతూ కనిపించిన వాహనా దారులతో మాట్లాడి.. వారిని ఎక్కడికి వెళ్తున్నారని మంత్రి మందలించారు. వారు చెప్పే సమాధానం అసంబద్ధతతో ఉన్నదని మూడు వాహనాలను సీజ్ చేయించారు. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైందని.. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రావొద్దని కోరారు. పోలీసు విధులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
tag:harish rao, says, Don’t turn, out, unnecessarily, siddipet