కరోనా నివారణకు సహకరించండి: హరీశ్ రావు

దిశ, మెదక్ : కరోనా వైరస్ నివారణకు సహకరించాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లాలోని డిగ్రి కళాశాల మైదానం, మల్టీపర్పస్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయలు మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపథ్యంలో సరుకుల రవాణా ఆగిపోవడం వల్ల పట్టణాలలో కూరగాయల ధరలు పెరగ్గా, గ్రామాల్లో తగ్గుముఖం పట్టాయని తెలిపారు. కూరగాయల ధరలు తగ్గడం వల్ల రైతులు పంట పొలాల్లో కూరగాయలను పారబోస్తున్నారని తెలిపారు. […]

Update: 2020-03-26 03:05 GMT

దిశ, మెదక్ : కరోనా వైరస్ నివారణకు సహకరించాలని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లాలోని డిగ్రి కళాశాల మైదానం, మల్టీపర్పస్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయలు మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నేపథ్యంలో సరుకుల రవాణా ఆగిపోవడం వల్ల పట్టణాలలో కూరగాయల ధరలు పెరగ్గా, గ్రామాల్లో తగ్గుముఖం పట్టాయని తెలిపారు. కూరగాయల ధరలు తగ్గడం వల్ల రైతులు పంట పొలాల్లో కూరగాయలను పారబోస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో మిర్చి ధర కిలో రూ.100 ఉండగా, టమాట ధర కిలో రూ. 50లకు పలుకుతోందన్నారు. వ్యవసాయ శాఖ సమన్వయంతో సరుకులకు అనుగుణంగా వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామం నుండి ఒక రైతు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏర్పాటు చేసి బోయినపల్లి మార్కెట్‌కు తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ ప్రజలకు కూరగాయలు అందుబాటులో ఉండేలా వెసులుబాటు కల్పిస్తామన్నారు. సంగారెడ్డి, పటాన్ చెరువు ప్రాంతాల్లోబ కూరగాయలకు డిమాండ్ ఉన్నదన్నారు. అలాగే, కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలు ఇళ్లలోనే ఉండి సహకరిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. చేయి దాటితే ఏం చేయలేమనీ, ఓపికతో ఉండాలని సూచించారు. ఇటలీలో ముసలి వాళ్లను రోడ్లపైనే వదిలేస్తున్నారని గుర్తు చేశారు. మన దేశంలో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారిని బయట తిరగనీవద్దన్నారు. ప్రధాని, సీఎం చెప్పినట్టుగా వారి సూచనలు ప్రతి ఒకరు పాటించాలన్నారు.

Tags: corona virus, harish rao, siddipet, vegetable market, covid-19

Tags:    

Similar News