అవసరం మేరకే టోకెన్లు జారీ చేయాలి: మంత్రి హరీశ్‌రావు

దిశ, మెదక్: కొనుగోలు కేంద్రంలో ఉన్న బ్యాగులు, హమాలీల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకే టోకెన్లు జారీ చేయాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నర్సాపూర్, రంగధాంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను అనుసరించి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. […]

Update: 2020-04-16 06:24 GMT

దిశ, మెదక్: కొనుగోలు కేంద్రంలో ఉన్న బ్యాగులు, హమాలీల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అవసరం మేరకే టోకెన్లు జారీ చేయాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని నర్సాపూర్, రంగధాంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను అనుసరించి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏఈఓలు అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోళ్లు క్రమపద్ధతిలో చేపట్టేలా కూపన్లు జారీ చేయాలని ఆదేశించారు. రైతులు సామాజిక దూరం పాటించాలని కోరారు. అంతకుముందు సిద్దిపేట ధార్మిక సేవా సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో మార్కెట్‌కు వచ్చిన రైతులకు మంత్రి హరీశ్‌రావు ఆహార ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఏంసీ ఛైర్మన్ పాల సాయిరాం, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సుడా ఛైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Harihs rao,inaugurated,rice purchase center

Tags:    

Similar News