ఆటోవాలాకు హరీష్ రావు అండ
దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లాలోని ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో ఆటో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దినం కష్టపడితేనే పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాoడ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]
దిశ, మెదక్: సిద్ధిపేట జిల్లాలోని ఆటో కార్మికులకు మంత్రి హరీష్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో ఆటో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దినం కష్టపడితేనే పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాoడ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సీఏం కేసీఆర్ 12కిలోల బియ్యం అందిస్తున్నారని తెలిపారు. అలాగే, రూ.1250 విలువ కలిగిన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.
tag: minister harish rao, auto drivers, helping, siddipet