ఒక్క ఓటమితో టీఆర్ఎస్‌కు నష్టమేమీలేదు.. ఈటల గెలుపుపై హరీష్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో : వన్ సైడ్ వార్ లా నడిచిన హుజురాబాద్ ఓట్ల లెక్కింపులో ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్ రావు రేయింబవళ్లు హుజురాబాద్‌లోనే ఉండి ప్రచారం చేసినా టీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఈటల గెలుపుపై హరీష్ రావు స్పందించారు. ‘‘హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ […]
దిశ, డైనమిక్ బ్యూరో : వన్ సైడ్ వార్ లా నడిచిన హుజురాబాద్ ఓట్ల లెక్కింపులో ఎట్టకేలకు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్ రావు రేయింబవళ్లు హుజురాబాద్‌లోనే ఉండి ప్రచారం చేసినా టీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఈటల గెలుపుపై హరీష్ రావు స్పందించారు.
‘‘హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజాతీర్పును శిరసావహిస్తాం. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదు. అయితే, దేశంలో ఎక్కడా లేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నిక ఓటమితో కుంగిపోదు.. గెలిచిననాడు పొంగిపోలేదు. ఓడినా, గెలిచిన టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుంది.’’ అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
హుజూరాబాద్‌లో ఈటల గెలుపు.. హరీష్ రావుకు కేటీఆర్ అభినందనలు
ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓటమితో కుంగిపోదు, గెలిచిననాడు పొంగిపోలేదు.
ఓడినా.. గెలిచిన టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుంది.— Harish Rao Thanneeru (@trsharish) November 2, 2021