ధరలు పెంచిన బీజేపీకి ఓటు వేస్తారా.. మాకు వేస్తారా: హరీశ్ రావు
దిశ, హుజురాబాద్: బీజేపీ గెలిస్తే ఈటలకు.. గెల్లును గెలిపిస్తే హుజురాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ స్థాయి రజక ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. అన్నిటిపై పన్నులు పెంచుతున్న బీజేపీకి ఓటు వేస్తారో.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తున్న టీఆర్ఎస్‌కు వేస్తారో ఆలోచించుకోవాలన్నారు. కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు […]
దిశ, హుజురాబాద్: బీజేపీ గెలిస్తే ఈటలకు.. గెల్లును గెలిపిస్తే హుజురాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ స్థాయి రజక ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. అన్నిటిపై పన్నులు పెంచుతున్న బీజేపీకి ఓటు వేస్తారో.. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తున్న టీఆర్ఎస్‌కు వేస్తారో ఆలోచించుకోవాలన్నారు. కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇందులో భాగంగా రజకుల అభ్యున్నతి కోసం బడ్జెట్లో 250 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇది చారిత్రాత్మకం..
అనంతరం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చారిత్రాత్మకమని అన్నారు. రజకుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. 18 ఏళ్లుగా ఈటల రజకులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. హుజురాబాద్‌లో జరుగనున్న శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, కొండపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.