ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు: హరీశ్ రావు
దిశ, మెదక్: లాక్డౌన్ దృష్ట్యా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసం నుంచి శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజమిల్‌ఖాన్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్ కుమార్ తదితరులతో హరీశ్ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. […]
దిశ, మెదక్: లాక్డౌన్ దృష్ట్యా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసం నుంచి శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజమిల్‌ఖాన్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రవణ్ కుమార్ తదితరులతో హరీశ్ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి జిల్లా కలెక్టర్కు వివరించారు.
Tags: Harish Rao, comments, Arrangements, grain purchases, siddipet