ఆ కోలీవుడ్ హీరోకు రష్మిక అంటే ఇష్టమట

హరీష్ కళ్యాణ్… కోలీవుడ్ హీరో. తెలుగులో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన “జెర్సీ” సినిమాలో నానికి కొడుకుగా అతిథి పాత్రలో కనిపించాడు. అయితే లాక్ డౌన్ కారణంగా అందరూ సినీ ప్రముఖులు మాదిరిగానే ఇంటికి పరిమితమై సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటున్న హరీష్ కళ్యాణ్… ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. హరీష్ కళ్యాణ్ నటించిన హిందీ ఫిల్మ్ విక్కీ డోనార్ తమిళ్ లో ధరల ప్రభుగా రీమేక్ కాగా… డిజిటల్ […]

Update: 2020-04-12 04:30 GMT

హరీష్ కళ్యాణ్… కోలీవుడ్ హీరో. తెలుగులో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన “జెర్సీ” సినిమాలో నానికి కొడుకుగా అతిథి పాత్రలో కనిపించాడు. అయితే లాక్ డౌన్ కారణంగా అందరూ సినీ ప్రముఖులు మాదిరిగానే ఇంటికి పరిమితమై సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటున్న హరీష్ కళ్యాణ్… ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. హరీష్ కళ్యాణ్ నటించిన హిందీ ఫిల్మ్ విక్కీ డోనార్ తమిళ్ లో ధరల ప్రభుగా రీమేక్ కాగా… డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఏప్రిల్ 9న విడుదలైంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన హీరో… ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఆశ్చర్య పరిచింది.

ఇంతకీ అభిమాని అడిగిన ప్రశ్న ఏంటంటే… హీరోయిన్లలో మీకు ఉన్న బిగ్ క్రష్ ఎవరూ? అని. దీనికి రష్మిక మందన్నా అంటే పెద్ద క్రష్ అని.. తను అంటే చాలా ఇష్టమని చెప్పాడు హరీష్ కళ్యాణ్. తనతో నటించాలని ఉందని కూడా చెప్పిన హీరో… గీత గోవిందం గాళ్ అని హాష్ ట్యాగ్ యాడ్ చేశాడు.

కాగా హరీష్ కళ్యాణ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన పెళ్లి చూపులు సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా చేస్తోంది.

Tags: Harish Kalyan, Rashmika Mandanna, Kollywood

Tags:    

Similar News